Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!
Naya Mall | భేష్ముఖానికి మర్దన
అందమైన ముఖాన్ని మరింత అందంగా, కాంతిమంతంగా మార్చేందుకు వచ్చిందే.. థెరబాడీ థెరఫేస్ ప్రో మసాజర్. దీంతో మర్దన చేయడం వల్ల మొహం మీద ముడతలు తగ్గడమే కాదు.. ఒత్తిడి, తలనొప్పి, కండ్లకింద వలయాల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు తయారీదారులు. దవడ నొప్పి లాంటి సమస్యలూ తగ్గుతాయట. ముఖం మీది మృతకణాలను తొలగించడంలోనూ, రక్తప్రసరణ మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. చార్జింగ్‌తో పనిచేసే ఈ ఫేస్ మసాజర్ ఆన్లైన్ ధర. రూ.30,500.

భేష్లెట్స్!
ఆధునిక యువత గాజులకంటే బ్రేస్లెట్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నది. వెస్ట్రన్‌వేర్ మీదికి నప్పేలా ‘ఎలాయిస్’ పేరుతో ఇసాబెల్ మారెంట్ సంస్థ నైలాన్ బ్రేస్లెట్లను రూపొందించింది. చక్కని మెరుపు, మృదువైన ఫినిషింగ్ వీటి ప్రత్యేకత. దృఢంగానూ ఉంటాయి. మరింత బలం కోసం సన్నని వెండి పట్టీలు జతచేశారు. వీటి అందమైన
అల్లికలూ ఆకట్టుకుంటాయి. లాకెట్లతో కలిపి కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ ధర. రూ.24,430.

కసరత్తుకు సై!
అధిక బరువు తగ్గించుకోవడానికి, శరీరాన్ని ఫిట్‌గా మలుచుకోవడానికి రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది సైక్లింగ్. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లి సైక్లింగ్ చేయడం కన్నా ఇంట్లోనే ప్రయత్నించడం మంచిది. అందుకోసమే, రకరకాల ఫీచర్లతో స్టాండింగ్ ఎక్సర్సైజ్ బైక్‌లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా, కెట్లర్ ఫ్రేమ్ సంస్థ ఓ సరికొత్త బైక్‌ను రూపొందించింది. కెలోరీల లెక్కలు, హృదయ స్పందనలు తదితర వివరాలను ఇది ఇట్టే చెప్పేస్తుంది. ధరల వివరాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

అందమైన కుండీలు
ఇంట్లో అణువణువూ అందంగా ఉంటేనే ఇల్లాలికి ఆనందం. ఆ అందం మొక్కలతో వస్తుంది. కాబట్టే గృహిణికి మొక్కలంటే అంత మక్కువ. ఈ ఫ్లవర్ ప్రింటెడ్ కుండీలైతే అందంలో మొక్కలతో పోటీపడతాయి. ఇనుముతో చేస్తారు కాబట్టి, పగిలిపోతాయనే భయం లేదు. పువ్వులు, మొక్కలు, పక్షులు, జంతువుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి, ఇంటీరియర్స్‌లో భాగం చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కావడం వల్ల తుప్పు పట్టే సమస్య లేదు. ఆన్లైన్ ధర రూ.200-రూ.20,000 వరకూ ఉంటుంది. వివరాలకు: edenscart.com
Read More :
“Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి”
“ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
Naya Mall | రోజూ పొద్దున్నే బ్రష్ చేయడం బద్దకంగా ఉందా.. ఈ డివైజ్ మీకోసమే”
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

