Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి
Naya Mall | స్వచ్ఛం.. ఆరోగ్యం
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిశుభ్రమైన నీరు తాగాలి. కానీ బయటికి వెళ్లినప్పుడు ఫిల్టర్ చేసిన నీళ్లు దొరకడం కష్టం. ఎట్టి పరిస్థితుల్లో అయినా చక్కగా వడబోసిన నీళ్లే తాగాలనుకునే వారికోసం పర్సనల్ వాటర్ ప్యూరిఫయర్ వచ్చేసింది. దీని ద్వారా ఎంతటి మురికి నీళ్లయినా 99 శాతం క్రిమిరహితంగా తయారవుతాయి. ఇది కంటికి కనపడని బ్యాక్టీరియాను సైతం పసిగట్టేస్తుంది. ఆన్లైన్ ధర రూ.1,290.

ఆదివాసీ అందాలు
పూసలు, రాళ్లతో రూపొందే ఆదివాసీ ఆభరణాలు ఆధునిక తరాన్నీ కట్టిపడేస్తున్నాయి. నగల తయారీలో టిబెటన్ ఆదివాసులు రెండాకులు ఎక్కువే చదివారు. సహజమైన రంగు రాళ్లు, ముత్యాలను పొదిగి.. తేలికైన లోహంతో రూపొందించిన ఈ ఆభరణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ డిజైనర్ యాండ్రిలా ఘోష్ తన ఇన్‌స్టా పేజ్ ద్వారా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఆరంభ ధర రూ.3,850. పూర్తి వివరాలకు @rahibyaindrila ఇన్‌స్టా పేజ్‌లో చూడవచ్చు.

హస్తభూషణం
అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్ హస్తభూషణం. ఎన్ని బ్యాగులున్నా కొత్త డిజైన్ల కోసం అన్వేషిస్తూనే ఉంటారు. అలాంటి వారికోసమే వైల్డ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ శివాంగీ బాజ్‌పేయి మిక్స్ మిట్టీ బ్రాండ్‌ను పరిచయం చేశారు. తేలికగా మట్టిలో కలిసిపోయే పర్యావరణ హితమైన పదార్థాలతో ఈ బ్యాగుల్ని తయారుచేయడం ప్రత్యేకత. ఈ మధ్యే కార్క్ బేస్డ్ బ్యాగులూ మార్కెట్లోకి వచ్చాయి. మగువల మనసు దోచేస్తున్న ఈ బ్యాగుల ఆరంభ ధర రూ.4,875.

పాదాలకు ఫ్యాబ్రిక్ సొగసు
సేఫ్టీ పిన్ నుంచి చెప్పుల వరకు ఏదైనా సరే స్టైలిష్zగా ఉండాల్సిందే. మ్యాచింగ్ అదిరిపోవాల్సిందే. ఫ్యాబ్రిక్‌కు జతగా వచ్చే ఈ స్లిప్పర్స్ నాజూకు పాదాలను హత్తుకుంటాయి, మెత్తగా ఒదిగిపోతాయి. లెదర్‌కు ఫ్యాబ్రిక్ పట్టీలు ఇవ్వడం వల్ల కాళ్లపై మచ్చలు పడే అవకాశం ఉండదు. ఇంట్లో, లాంజ్‌లో తిరిగేందుకు అనువుగానూ ఉంటాయి. ఈ ఫ్యాషనబుల్ చెప్పుల ఆన్లైన్ ధర రూ.2,690. పూర్తి వివరాలకు Fizzygoblet.com లో చూడవచ్చు.
Read More :
ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
Naya Mall | రోజూ పొద్దున్నే బ్రష్ చేయడం బద్దకంగా ఉందా.. ఈ డివైజ్ మీకోసమే”
“Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా జాగా లేదని ఫీలవుతున్నారా? ఒకసారి వీటిపైపు ఓ లుక్కేయండి”
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

