ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్లు స్కానింగ్ చేయించుకుని రమ్మని చెబుతారు. అక్కడికి వెళ్తేనేమో.. గంటల తరబడి వరుసలో నిలబడాలి. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఇంట్లోనే కావలసిన పరీక్షలన్నీ చేసుకునేందుకు వీలుగా ఓ వినూత్నమైన బాడీ స్కానర్ అందుబాటులోకి రానుంది. ‘విథింగ్స్’ సంస్థ రూపొందించిన ఈ స్కానర్ ద్వారా బరువు, శరీరంలో మార్పులు, నాడీ వ్యవస్థ పనితీరు, ఈసీజీ సహా గుండె పని తీరును కూడా ఇంట్లోనే తెలుసుకోవచ్చు. విథింగ్స్ యాప్‌లోని ప్రమాణాలతో సరిపోల్చుకుని మన ఆరోగ్యాన్ని బేరీజు వేసుకోవచ్చు. చిన్నచిన్న సమస్యలకు పరిష్కారాలు కూడా ఈ యాప్‌లో ఉంటాయి. ధర ఇంకా నిర్ణయించలేదు. మరిన్ని వివరాలకు, ఇంకొన్ని ఉత్పత్తులకు ‘విథింగ్స్’ సంస్థ వెబ్సైట్ చూడవచ్చు.
ఉల్సీ నదీన్.. వినూత్నమైన ఫీచర్లతో కళ్లు చెదిరిపోయే వాచీలను తయారుచేయడంలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. తాజాగా సూర్యచంద్రుల గమనం ఆధారంగా సమయాన్ని నిర్దేశించే ఓ కొత్త గడియారాన్ని ప్రవేశపెట్టి ఔరా! అనిపిస్తున్నది. అన్ని వాచీల్లానే ఇందులోనూ మూడు ముళ్లే ఉన్నా.. వాటి నడక మాత్రం సూర్యుడు, చంద్రుడు, భూమి భ్రమణాన్ని బట్టి ఉంటుంది. భూమిని కేంద్రంగా చేసుకొని, సూర్యచంద్రుల గమనం ఆధారంగా కచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. అంతేకాదు, ఒకే సమయంలో ఏయే దేశాల్లో ఎంత సమయం అవుతున్నదో కూడా తెలుసుకోవచ్చు. దీని ధర రూ. 59 లక్షలు మాత్రమే!
అతివల హస్తభూషణాలు హ్యాండ్ బ్యాగులు. షాపింగ్, ఆఫీస్, హాస్పిటల్, సినిమా, పిక్నిక్.. ఎక్కడికెళ్లినా హ్యాండ్ కర్చిఫ్ నుంచి ఆభరణాల వరకూ, ఆధార్ నుంచి పాన్ దాకా.. అన్నీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇమిడిపోవాల్సిందే. కాబట్టే, మగువల మనసులు దోచే రకరకాల డిజైనర్ హ్యాండ్ బ్యాగులు మార్కెట్లో సందడి చేస్తాయి. తాజాగా ‘జిమ్మీ చూ’ అనే బ్యాగుల విక్రయ సంస్థ నాణ్యమైన శాటిన్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే చూసేందుకు చిన్నగా ఉన్నా, చేతిలో నిండుగా ఉంటాయి. అంతేకాదు సౌకర్యంగా పట్టుకోవచ్చు, భుజానికి కూడా తగిలించుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ.85,000/- మాత్రమే.
ఎంత చక్కగా సర్దినా, ఎన్ని ఖరీదైన అలంకరణలు ఉన్నా.. ఇంటికి అందం దీపాలే. కాబట్టే, ముచ్చటైన దీపపు స్టాండు డ్రాయింగ్‌రూమ్‌లో ఉండి తీరాల్సిందేనంటున్నారు గృహిణులు. అందులోనూ బంగారువన్నె అద్దిన లోహపు స్టాండులు రాచఠీవిని ఒలక బోస్తాయి. వీటిని గాజు మేళవింపుతోనూ ముచ్చటగా డిజైన్ చేస్తున్నారు. ఆన్లైన్లో వీటి ధర రూ.5,000/- నుంచి ప్రారంభం అవుతున్నది.
మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !