Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..
ష్.. గప్‌చుప్!
కరోనా దెబ్బకు రెండేండ్లపాటు ఆఫీసు పనులన్నీ ఇంటి నుంచే చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆఫీసులకు వెళ్తున్నా.. ఏ ఆదివారమో హఠాత్తుగా బాసు నుంచో ైక్లెంట్స్ నుంచో కాల్స్ వస్తూనే ఉంటాయి. సరిగ్గా ఆ సమయానికి హాల్లో టీవీ వాల్యూమ్ పీక్స్‌లో ఉంటుంది. లేదంటే వీధి కుక్కల అరుపులు, కూరగాయల బండి రాగాలు.. ఇబ్బంది పెడతాయి. ఆ అవాంఛిత శబ్దాలకు చెక్ పెట్టేందుకు వచ్చిందే.. ‘ముజో పర్సనల్ జోన్ మేకర్’. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని మన పక్కన పెట్టుకుంటే.. మన మాటలు బయటకి వెళ్లవు. బయటి శబ్దాలు మన పరిసరాల్లోకి రావు. ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఆన్లైన్లో దీని ధర తొమ్మిది వేలు.

మెత్తగా.. వెచ్చగా
చలికాలం పాదాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆ ప్రయత్నంలో ఉపకరించేవే.. ఈ మెత్తని ఊలు జోళ్లు. ఇవి పాదాలను వెచ్చగా ఉంచుతాయి, మృదువుగానూ మారుస్తాయి. ఇంట్లో వేసుకునేందుకు పూర్తిగా ఊలుతో, ఆఫీసు అవసరాల కోసం.. లోపల లెదర్‌తో, బయట ఊలుతో రూపొందించారు. ధరల విషయానికొస్తే అంతర్జాతీయ బ్రాండ్లు యాభైవేల వరకూ పలుకుతున్నాయి. లోకల్ మాల్.. తక్కువ ధరకే వస్తుంది.

మినీ థియేటర్ ఇంట్లోనే..
ఒకప్పుడు.. థియేటర్లలో ప్రొజెక్టర్లతో సినిమాలు వేసేవారు. అదే టెక్నాలజీతో ఇప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు ప్రజెంటేషన్లను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రొజెక్టర్ కనుక ఉంటే.. ల్యాప్‌టాప్‌తో పన్లేదు. ఇంట్లోనే, ఓ తెర ఏర్పాటు చేసుకుని సినిమాలూ చూడొచ్చు. దీనికి స్పీకర్లు, హెడ్సెట్ జాక్ ఉంటాయి. ఒక్కసారి పూర్తి చార్జింగ్ చేస్తే, రెండున్నర గంటల వరకు వీడియో లేదా ఫొటోలు ప్లే చేయవచ్చు. కంపెనీని బట్టి, ఫీచర్లను బట్టి ధర ఐదు వేల నుంచి యాభైవేల వరకూ ఉంటుంది.

చోప్ మిక్స్
ఏ విహార యాత్రలకో వెళ్లినప్పుడు సులువుగా కూరగాయలు తరిగేందుకు పనికొస్తుందీ.. రీచార్జబుల్ చోప్మిక్స్. కరెంటుతో పన్లేదు. బ్యాటరీలతో చక్కబెట్టేస్తుంది. ఒక్క చోప్మిక్స్ ఉంటే చాలు.. కూరగాయలను నచ్చిన రీతిలో కోసుకోవచ్చు, తురుముకోవచ్చు, రసం తీసుకోవచ్చు. ఆన్లైన్ ధర పదిహేను వందలు మాత్రమే.
Read More :
మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- gadgets
- Naya mall
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

