Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !

Naya Mall | కారు కళ వచ్చేసిందె బాలా!
బీఎండబ్ల్యూ గురించి తెలియని వారెవరు? ఆ కారును సొంతం చేసుకోవడమే ఒక కల. అందులోనూ ఆ కంపెనీ ఎప్పటికప్పుడు ప్రపంచానికి తన ప్రత్యేకతను చాటి చెబుతూనే ఉంది. ఇటీవల ఎకో ఫ్రెండ్లీఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది కూడా. పైగా వాటిపై గొప్పగొప్ప కళాకారులతో చిత్రాలను వేయించింది. అన్నట్టు, ఈ కొత్త కారుకు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే.. 425 కిలోమీటర్లు దూసుకుపోతుంది.

మెడలో గొలుసైపోద్ది..
టెక్నాలజీ రోజురోజుకూ అప్డేట్ అవుతున్నది. అందులోనూ ఇయర్ ఫోన్స్‌లో మార్పును ప్రజలూ ఆహ్వానిస్తున్నారు. వైర్డ్ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ నుంచి వైర్లెస్, బ్లూటూత్ నెక్‌బ్యాండ్, కేవలం ఇయర్ ప్లగ్స్ వరకు ఎన్నోరకాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు సోనీ కంపెనీ నుంచి వైర్లెస్ నెక్‌బ్యాండ్ రానుంది. ఇది ఓ మోస్తరు అలంకరణగానూ ఉపయోగపడుతుంది. ఓ నాలుగైదు రంగులు కొనేసుకుంటే.. మ్యాచింగ్గానూ పనికొస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మీటింగ్‌లో గ్లామరస్‌గానూ కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ 20 గంటలు. ధర రూ. పదకొండు వేల పైచిలుకు.

మినుప మ్యాజిక్..
మినుము తిన్న మనిషి ఇనుముతో సమానం! మినుప పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినుప వడల నుంచి సున్నుండల వరకు అన్నిట్లోనూ మినుములే. అయితే ఇప్పుడు చర్మ సౌందర్య ఉత్పత్తుల్లోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను దూరం చేసేందుకు మినుములోని ఆయుర్వేద గుణం ఎంతగానో తోడ్పడుతుంది. చర్మాన్ని పొడిబారకుండా చేసే మాయిశ్చరైజర్, సీరమ్ మొదలైన ఉత్పత్తుల్లో మినుములను విరివిగా జోడిస్తున్నాయి వివిధ కంపెనీలు. వీటి ధర రూ.1,749 మాత్రమే.

ఆర్గానిక్ చిరుతిండ్లు!
చిరుతిండ్ల పేరెత్తితేనే న్యూట్రిషనిస్టులకు కోపం వచ్చేస్తుంది. వాటిలో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలే ఎక్కువ మరి. చిన్నారులు ఆ పిజ్జా, బర్గర్ల జోలికి వెళ్లకుండా.. పోషక విలువలను ఇచ్చే పదార్థాల్ని తింటే తల్లిదండ్రులూ మురిసిపోతారు! అందుకే, ‘లిల్ గుడ్నెస్ కంపెనీ’ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. పిల్లల కోసం ‘ఇమ్యూనిటీ బాక్స్’ను తీసుకొచ్చింది. నెలలవారీగా చందా తీసుకుంటే.. వారంవారం పోషకాహారం మనింటికే వస్తుంది. సోమవారానికి ఓట్స్, ఖర్జూరాలతో చేసిన షేక్, మంగళవారం ట్యాంగీ టమాట పఫ్, బుధవారం క్రాకల్ బైట్స్, గురువారం ట్రెయిల్ మిక్స్, శుక్రవారం పెరీపెరీ పఫ్, ఆదివారం మసాలా బీట్రూట్ క్రాకర్స్.. అన్నీ ఆరోగ్యకరమైనవే! ఈ స్నాక్స్‌లో విటమిన్-సి, ఇ, బి12 తోపాటు జింక్, ఐరన్, ప్రొబయోటిక్ ఫైబర్ పుష్కలం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
iPhone | పేమెంట్ వాలెట్‌లా మారనున్న ఐఫోన్.. క్యూఆర్ కోడ్ అవసరం లేకుండా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

