iPhone 15 Pro | ఐఫోన్ 14 కంటే ముందే ఐఫోన్ 15 లాంచ్ కానుందా? అందుకే ఐఫోన్ 15 ప్రో ఫీచర్లు లీకయ్యాయా?
iPhone 15 Pro | గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ అయిన విషయం తెలిసిందే కదా. యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం ఒక ఐఫోన్ మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేస్తుంటుంది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అయితే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, 13 మినీ ఫోన్లు విడుదలయ్యాయి.

ఆ తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐఫోన్ 14కు సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా ఆ మధ్య లీక్ అయ్యాయి. అయితే.. ఇంకా ఐఫోన్ 14 రిలీజ్ కాలేదు కానీ.. అప్పుడే ఐఫోన్ 15 ప్రో ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐఫోన్ 14 కంటే ముందు యాపిల్ ఐఫోన్ 15 ను రిలీజ్ చేస్తుందా ఏంటి అన్న అనుమానాలు ప్రస్తుతం యాపిల్ లవర్స్‌కు వస్తున్నాయి.
కానీ.. ఐఫోన్ 14 సిరీస్‌నే త్వరలో యాపిల్ సంస్థ లాంచ్ చేయనుందట. ఐఫోన్ 15ను 2023లో యాపిల్ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఫోన్లు పెరిస్కోప్ కెమెరాతో రానున్నాయి. ఇటువంటి కెమెరాతో ఇప్పటి వరకు ఏ ఐఫోన్ రాలేదు. అది కూడా 5ఎక్స్ పెరిస్కోమ్ కెమెరా. ఈ కెమెరాను కేవలం ఐఫోన్ 15 ప్రోలోనే యాపిల్ తీసుకురానుంది.
5 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్ ఫీచర్‌తో ఐఫోన్ 15 ప్రో రానున్నా.. ఇంకా ఇతర ఏ ఫీచర్లు ఐఫోన్ 15 ప్రోలో ఉంటాయో మాత్రం యాపిల్ సంస్థ వెల్లడించలేదు. ఇక.. ఈ సంవత్సరం లాంచ్ కానున్న ఐఫోన్ 14లో 120 హెచ్‌జెడ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, నెక్స్ట్ జనరేషన్ ఏ16 బయోనిక్ చిప్సెట్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 మినీ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

