Tata Sky | టాటా స్కై గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) కోసం చాలామంది వినియోగదారులు టాటా స్కైనే వాడుతారు. మన దేశంలో ఎక్కువ మంది వినియోగించేది టాటా స్కైనే. తాజాగా టాటా స్కై పేరును టాటా ప్లేగా మార్చారు. దానికి కారణం టాటా ప్లేతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా అందించడం కోసం.
ప్రస్తుతం స్మార్ట్ టీవీల కాలం నడుస్తుండటంతో ఓటీటీ యాప్స్‌ను స్మార్ట్ టీవీలలోనూ యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా యాప్స్‌కు సపరేట్గా సబ్‌స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇక నుంచి అటువంటి అవసరం లేకుండా.. టాటా ప్లే డీటీహెచ్ కనెక్షన్ ఉంటే చాలు.. స్మార్ట్ టీవీలలో డైరెక్ట్‌గా ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. దాని కోసమే టాటా స్కై.. టాటా ప్లేగా పేరు మార్చుకొని సరికొత్త ఓటీటీ అగ్రగేటర్గా ముందుకు వచ్చింది.
టాటా ప్లే ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా 13 ఓటీటీ యాప్స్‌ను స్మార్ట్ టీవీలలో యాక్సెస్ చేసుకోవచ్చు. దాని కోసం టాటా స్కై బింగె ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. అందులో రూ.399 ప్లాన్ ఒకటి. అలాగే.. ఇప్పటికే టాటా స్కై బింగే ప్లస్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ఉంది. కానీ.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అన్ని ఓటీటీలను యాక్సెస్ లభిస్తుంది.
Suna kya? Tata Sky is now Tata Play!
— Tata Play (@TataPlayin) January 27, 2022
And you don't need to be an MA in English to enjoy all your favorite Jingalala Entertainment on Tata Play!
Toh #AaoPlayKare with #TataPlay#EntertainmentAurBhiJingalala #TataSkyIsNowTataPlay #MoreOnTataPlay #TataSkyAbHuaTataPlay pic.twitter.com/orFDo04Zit
టాటా ప్లే నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్‌ను తీసుకోవచ్చు. టాటా ప్లే వాలెట్‌ను ఉపయోగించుకొని సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.