మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
శునకానికి.. ‘కాలర్’ రక్ష!
సాధారణంగా పెంపుడు కుక్క మెడకు బెల్ట్ లేదా కాలర్ తప్పనిసరి. కాబట్టే, సరికొత్త హంగులతో మార్కెట్లో ఓ కొత్తరకం కాలర్ హల్చల్ చేస్తున్నది. ఇది శునకం ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతుంది. దాని గుండె చప్పుడును గమనిస్తూ ఉంటుంది. హృదయ స్పందనలో ఏ చిన్న మార్పు వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా వెంటనే యజమానికి సమాచారం చేరవేస్తుంది. శునకం నిద్ర వేళల్ని రికార్డు చేస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా కుక్క ఎక్కడ ఉన్నా, ఆ సమాచారాన్నీ యజమానికి అందిస్తుందీ స్మార్ట్ డాగ్ కాలర్. ఆన్లైన్లో దీని ధర ఎనిమిది వేల వరకూ ఉంటుంది.

ఇంట్లోనే పచ్చని పెరడు..
అపార్ట్మెంట్ జీవితంలో మొక్కలకు చోటు లేకుండా పోయింది. అయినా, పెరడు ఉంటే కదా మొక్కలు! ఆ కొరతను తీర్చేందుకే.. ఎల్జీ బ్రాండ్ ‘టీఐఐయూఎన్’ గార్డెన్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. దీన్ని హాలులో లేదా బాల్కనీలో పెట్టుకోవచ్చు. కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలు.. ఇలా పన్నెండు రకాల పంటలు సాగు చేయొచ్చు. ఈ యంత్రం బయటి వాతావరణాన్ని నియంత్రిస్తూ మొక్కలను సంరక్షిస్తుంది. ధర లక్ష రూపాయల వరకూ ఉండవచ్చు. పచ్చదనాన్ని ప్రేమించాలని అనిపించినప్పుడు ఆ డబ్బావైపు చూస్తే చాలు.

ఇస్మార్ట్ కండ్లజోడు
ఇప్పుడంతా స్మార్ట్‌మయం! స్మార్ట్ నెక్‌బ్యాండ్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ బాత్మ్యాట్.. ఇలా అన్నిట్లోనూ టెక్నాలజీ కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నది. తాజాగా, స్మార్ట్ కండ్లజోళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది టైటన్ కంపెనీ. బయటికి వెళ్లినప్పుడు సన్గ్లాసెస్గా, కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు యాంటీగ్లేర్ అద్దాలుగా.. ఈ స్మార్ట్ కండ్లజోళ్లు పనిచేస్తాయి. దీనికి వైర్లెస్ ఆడియో సౌకర్యం ఉంది. ఫిట్నెస్ ట్రాకర్‌గానూ పనిచేస్తుంది. ధర దాదాపు పదివేలు.

ఆయుర్వేద పీచు!
పూర్వం నుంచీ ఒళ్లు రుద్దుకోవడానికి కొబ్బరి పీచు వాడటం అలవాటే. ఆ స్థానంలో ప్లాస్టిక్ లూఫాలు వచ్చాయి. అయితే పర్యావరణ ప్రియులు మళ్లీ పాతకాలపు పద్ధతులవైపే అడుగేస్తున్నారు. ప్లాస్టిక్ లూఫాలకు బదులు కిత్తలి ఆకులు, వట్టి వేర్లతో తయారు చేసినవాటిని ఎంచుకుంటున్నారు. ఓ ఆయుర్వేద కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది చర్మం మీదున్న మృతకణాలను దూరం చేయడంతోపాటు మృదువుగా మారుస్తుంది. ధర పదిహేను వందలు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !
iPhone | పేమెంట్ వాలెట్‌లా మారనున్న ఐఫోన్.. క్యూఆర్ కోడ్ అవసరం లేకుండా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- gadgets
- Sunday
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

