Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
Tollywood | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి పైరసీ కలకలం రేగింది. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన 'ఆకాశంలో ఒక తార' చిత్రంతో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రణబాలి', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం (హౌస్ నంబర్ 47)' సినిమాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి పైరసీ కలకలం రేగింది. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నంబర్ 47)’ సినిమాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడం చిత్ర వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ నాలుగు సినిమాల పైరసీ కాపీలు go2.india4movies.click అనే వెబ్సైట్లో అక్రమంగా అప్లోడ్ అయినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు గుర్తించి శుక్రవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులకు ఫిర్యాదు చేశారు.
క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ పైరసీ వెనుక ఉన్న కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్లో దుండగులు క్యామ్కార్డర్తో రహస్యంగా చిత్రీకరించినట్లు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్నూలు థియేటర్లోని సీసీటీవీ ఫుటేజ్, షో వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను పరిశీలించడంతో పాటు సదరు వెబ్సైట్ నిర్వాహకులు మరియు సినిమాలను అప్లోడ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సినిమాలు విడుదలైన రోజే ఇంటర్నెట్లో లీక్ కావడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని సినీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ENE 2 | అమెరికాలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ జోరు.. రెండు రోజుల్లోనే 7.5 లక్షల డాలర్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

