Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు
థర్మాసెల్ ఎల్ఐవీ..
ఒకప్పుడు దోమల్ని పారదోలడానికి బత్తీలు, బిళ్లలు వాడేవారు. ఆ తర్వాత లిక్విడ్ రీఫిల్స్ వచ్చాయి. ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో నడిచే వివిధ పరికరాలు దొరుకుతున్నాయి. అందులో ఒకటి.. థర్మాసెల్ ఎల్ఐవీ. స్మార్ట్‌ఫోన్ యాప్‌తో ఇది పనిచేస్తుంది. 20 అడుగుల దూరం వరకూ దోమల బెడద లేకుండా చేస్తుంది. ఎంత ప్రమాదకరమైన దోమలనైనా నాశనం చేస్తుంది. దీన్ని ఇంట్లోనే కాకుండా బాల్కనీ, గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్, వెదర్‌ప్రూఫ్ కావడం కలిసొచ్చే అంశం. మార్కెట్లో దీని ధర రూ.54,000.

బేబోట్ ఓపెన్ అలర్ట్..
మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఇంటిని దొంగల బారినుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటే బేఫికర్‌గా ఉంటుంది. స్మార్ట్ఫోనే ఇంటికి రక్షణ కవచంలా నిలుస్తుంది. వైర్ల జంజాటం లేకుండానే.. స్మార్ట్‌గా పనిచేస్తుందీ.. డోర్ సెన్సర్. వైఫైకి కనెక్ట్ చేసి ద్వారానికి బిగిస్తే చాలు.

తలుపు తెరిచినా, మూసినా, తెరిచే ఉన్నా వెంటనే యజమాని ఫోన్‌కు సమాచారం వస్తుంది. పరిస్థితిని బట్టి వెంటనే స్పందించవచ్చు. అగ్గిపెట్టె పరిమాణంలోని ఈ పరికరం బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రధాన ద్వారానికే కాదు, ఏ గది తలుపుకైనా అమర్చొచ్చు. ఆఫీసులకూ ఉపయోగించవచ్చు. మార్కెట్లో దీని ధర రూ.3,399.

ఎక్స్పోర్ట్ టమాట గుజ్జు!
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే ఆహార పదార్థాల గురించి మనకు తెలుసు. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కివీ, క్యాప్సికమ్, డ్రాగన్ ఫ్రూట్ మొదలైనవీ మనకు తెలుసు. కానీ, టమాట ఉత్పత్తులు కూడా విదేశాల నుంచి వస్తున్నాయన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఉడికించి తొక్క తీసిన టమాట గుజ్జు ప్యాకెట్లు యూరప్ నుంచి భారతదేశానికి చేరుతున్నాయి. దీనిని నేరుగా పప్పులోనో, రసంలోనో వాడుకోవచ్చు. సాస్, సూప్ లాంటివి కూడా చేసుకోవచ్చు. పది కిలోల టమాట గుజ్జు ధర రూ.6,257.
![]()
రేజర్ ఐకన్..
బ్యాటరీతో నడిచే ఐకన్ స్కూటర్ యువతను ఆకట్టుకుంటున్నది. చాలా తేలికగా ఉంటుంది కాబట్టి, సులువుగా మడత పెట్టేయవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. చార్జింగ్ ఎంత ఉందన్నది డిస్ప్లేలో తెలుస్తుంది. ధర రూ.42,000 నుంచి ప్రారంభం.
Read More :
“మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా జాగా లేదని ఫీలవుతున్నారా? ఒకసారి వీటిపైపు ఓ లుక్కేయండి”
“Naya Mall | ఆడ, మగ ఇద్దరూ వేసుకునే ఈ నగల గురించి తెలుసా”
“Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..”
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- gadgets
- mosquitoes
- Naya mall
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

