Naya Mall | ఆడ, మగ ఇద్దరూ వేసుకునే ఈ నగల గురించి తెలుసా
మగాడ (మగ+ఆడ) నగలు!
చెవిపోగులు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, గొలుసులు.. ఒకటేమిటి అన్ని రకాల నగలనూ ధరిస్తూ ఆభరణాల మోజులో అతివలకేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు మగ మహారాజులు. కాబట్టే, ‘ప్రకాశి’ అనే జువెలరీ సంస్థ ఆడ, మగ.. ఇద్దరికీ పనికొచ్చే సరికొత్త నగలను తెచ్చింది. వివరాలకు తయారీ సంస్థ వెబ్సైట్ చూడవచ్చు.

స్వచ్ఛతను ‘గాలి’స్తుంది!
ప్రస్తుత పరిస్థితుల్లో పీల్చే గాలినైనా అనుమానించాల్సిందే. కంటికి కనపడని వైరస్, బ్యాక్టీరియా గాలిద్వారా శరీరంలోకి చొరబడి రకరకాల వ్యాధులకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘ఎయిర్‌థింగ్స్’ సంస్థ ‘వ్యూ ప్లస్’ అనే ఎయిర్ ప్యూరిఫయర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రం మనం పీల్చే గాలి ఎంత స్వచ్ఛమైందో లెక్కేసి చెబుతుంది. హానికర వైరస్, బ్యాక్టీరియాను పారదోలుతుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని వైఫైతో కనెక్ట్ చేసి మొబైల్‌కు జతచేస్తే సరిపోతుంది. ఆన్లైన్ ధర. రూ. 25,999/-.

కమ్మని కాఫీ.. కప్పుతో సహా!
ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు కాఫీ పడనిదే రోజు ప్రారంభం కాదు చాలామందికి. అలాంటివారి కోసం ‘స్లీపీ ఔల్’ సంస్థ సరికొత్త కాఫీని మార్కెట్లోకి తెచ్చింది. కాఫీ తాగాలనిపించగానే కప్పు కోసమో, చక్కెర కోసమో, పౌడర్ కోసమో వెతుక్కోవాల్సిన పన్లేదు. సమస్తం ఈ ప్యాకెట్లోనే ఉంటాయి. ఆన్లైన్లో 100 గ్రా. ప్యాకెట్ ధర. రూ. 16,999/- మాత్రమే.

సైక్లింగ్ సరికొత్తగా..
రోజంతా ఎంత ఖరీదైన కార్లలో తిరిగినా, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే మాత్రం ఉదయాన్నే లేచి ఏదో ఓ వ్యాయామం చేయాల్సిందే. నిజానికి సైక్లింగ్‌ను మించిన కసరత్తు లేదు. అందుకే రకరకాల వ్యాయామ సైకిళ్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ‘కల్ట్ ఫిట్’ నుంచి 21.5 అంగుళాల స్క్రీన్‌తో మరో స్మార్ట్ సైకిల్ వచ్చేసింది. సలహాలు, సూచనలకోసం దాదాపు 200 వీడియోలు అందుబాటులో ఉంటాయి. లైవ్‌లో నిపుణుల సలహాలూ కోరవచ్చు. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ ప్రకృతిలో విహరిస్తున్న అనుభూతిని పొందేలా రకరకాల వీడియోలను అప్లోడ్ చేశారు. ఆన్లైన్ ధర రూ. 49,900/- మాత్రమే.
Read More :
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..
మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

