మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా జాగా లేదని ఫీలవుతున్నారా? ఒకసారి వీటిపైపు ఓ లుక్కేయండి
జాగా లేకపోతేనేం..
పచ్చని మొక్కలంటే ఇష్టమా? కానీ స్థలాభావం వల్ల అపార్ట్‌మెంట్‌లోనో, అద్దె ఇంట్లోనో పెంచుకోలేకపోతున్నారా? ఇప్పుడా బాధ లేదు. రకరకాల వాల్ పాట్స్ అందుబాటులో ఉన్నాయి. మట్టి, నీరు నామమాత్రంగా అవసరం అవుతాయి. గోడలే నేలలుగా కుండీలలో రకరకాల మొక్కలను పెంచుకోవచ్చు. ఎల్యీడీ దీపాలతోనూ లభిస్తున్నాయి. ధర ఆన్లైన్లో రూ.500/- నుంచి.
ఎమోజీ.. కీబోర్డ్!
ఎమోజీ.. ఒక్క బొమ్మతో ఎంతో అర్థవంతమైన భావాన్ని పంచే ఆధునిక వ్యక్తీకరణ. మెసేజ్‌లు, కామెంట్స్‌కు ఎమోజీలూ తోడవుతున్నాయి. నవ్వు, ఏడుపు, ఆశ్చర్యం, ఆశ, నిరాశ… వేల భావనలను సచిత్రంగా వ్యక్తం చేయవచ్చు. ఇక నుంచి నేరుగా కీబోర్డు మీదే ఎంచుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ. 9,995/-.

‘అధ’రహో..
అతివల అందం అధర సౌందర్యంతో రెట్టింపు అవుతుంది. ఆకర్షణీయమైన పెదాలకోసం భారతీయ కాస్మొటిక్ సంస్థ మామ్స్ కో ‘నేచురల్ లిప్ స్క్రబ్’ను లాంచ్ చేయనుంది. ఈ స్క్రబ్ పెదవులను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలుష్యం కారణంగానో, సూర్యరశ్మి ప్రభావం వల్లనో నల్లగా మారిన పెదాలను సహజరంగులోకి మార్చడమే కాదు, పొలుసులు పొలుసులుగా ఊడిపోయే మృత చర్మకణాలనూ తొలగించి మృదువుగా తయారు చేస్తుంది. ఆన్లైన్ ధర రూ.298/-.

‘సహజ’ సౌందర్యం!
అందాల భామ దీపిక పదుకొనే చీరకట్టు కనికట్టు వెనుక ఓ రహస్యం ఉంది. ఆదిత్య బిర్లాగ్రూప్కు చెందిన ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్.. లివా ‘నవ్యస’ పేరుతో సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన నాజూకైన చీరలను మార్కెట్లో విడుదల చేసింది. ధర ఐదు వేల నుంచి పదిహేను వేల మధ్య ఉంటుంది.

ఈ ల్యాంప్ మరీ స్మార్ట్!
చదువుకుందామంటే.. ఉన్నట్టుండి కరెంట్ పోతుందా? రాత్రిళ్లు లాప్టాప్తో పనిచేసుకోవాలంటే చీకట్లో తడుముకోవాల్సి వస్తుందా? ‘విట్’ ఇ-రీడింగ్ లైట్‌తో ఆ సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టేయవచ్చు. పరిసరాల్లోని పరిస్థితుల ఆధారంగా ఎంత కాంతిని ఇవ్వాలన్నది అదే నిర్ణయించుకుంటుంది. ఆ మేరకు తనకుతాను సర్దుబాటు చేసుకుంటుంది. అంతేకాదు, యాంటీగ్లేర్ టెక్నాలజీతో కండ్లపై ఒత్తిడిపడకుండా చూస్తుంది. ల్యాంప్ నుంచి వేడి ఉత్పత్తి కాకుండా, కూలర్ టోన్‌లోకి మార్చుకోవచ్చు కూడా. రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఈ ల్యాంప్ ఆన్లైన్ ధర. రూ. 9,940/-.
Read More :
Naya Mall | ఆడ, మగ ఇద్దరూ వేసుకునే ఈ నగల గురించి తెలుసా
Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..
మీ పెంపుడు శునకాలకు ఈ స్మార్ట్ బెల్ట్ వేయండి.. రిజల్ట్ చూడండి..
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Naya Mall | మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వీటి గురించి తెలుసా !
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- emoji
- Naya mall
- Plantation
- tree
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!


