ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!
Naya Mall | చిటికెలో ముడత మాయం
గంటల తరబడి అద్దంముందు నిలబడి ముస్తాబైన తర్వాత.. మనం ధరించాలనుకున్న దుస్తులమీద ముడతలు కనబడితే.. హుషారంతా ఆవిరైపోతుంది. లేని ఓపిక తెచ్చుకుని ఇస్త్రీ పెట్టె వెతుక్కోవాలి. ఫంక్షన్‌కు ఇంకో గంట ఆలస్యం. కానీ ఆ అవసరం లేకుండా ఎలాంటి ముడతల్ని అయినా చిటికెలో మాయం చేసేందుకు వచ్చిందే ఇన్స్టంట్ ఫ్యాబ్రిక్ రింకిల్ రిమూవర్. ముడతలు పడిన దుస్తుల మీద దీన్ని స్ప్రే చేస్తే చాలు.. ఇస్త్రీ చేసినంత చక్కగా తయారైపోతుంది. ఇందులోని రసాయనాలు ఫ్యాబ్రిక్‌కు ఏమాత్రం హాని చేయవు. స్ప్రే తాలూకు తేమ క్షణాల్లో ఆరిపోతుంది కూడా. లావెండర్ సువాసన వెదజల్లే మ్యాజికల్ రింకిల్ రిమూవర్ ధర. రూ.299 మాత్రమే.

పాపాయికి హాయిగా
పిల్లలతో దూర ప్రయాణాలంటే చాలా కష్టం. ముఖ్యంగా నిద్రలేకపోతే పసిబిడ్డలు చికాకుపడతారు. సతాయిస్తారు. ఇక ఆ ఇబ్బంది ఉండదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు, పిల్లలు హాయిగా పడుకునేందుకు వీలుగా.. మాక్స్కోసి ఐరిస్ ట్రావెల్ కాట్ వచ్చేసింది. దీంట్లో బిడ్డల్ని పడుకోబెట్టి ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. పిల్లల వయసును బట్టి దీని ఎత్తు, వెడల్పు సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రయాణాల్లోనే కాదు హాల్లో, గార్డెన్లో ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. పిల్లలను చక్కగా పడుకోబెట్టొచ్చు. మడిచి బ్యాగ్‌లా ప్యాక్ చేసుకునే వీలు కూడా ఉంది. ఈ పిల్లల పడక ఆన్లైన్ ధర రూ.34,999 మాత్రమే.

దుర్వాసన రాకుండా
ఎండాకాలం వచ్చిందంటే చాలు. ఎంత చక్కగా స్నానం చేసినా కాసేపటికే చెమట కంపు చంపేస్తుంది. ముఖ్యంగా షూ, సాక్సుల చెడువాసన హానికరం కూడా. బ్యాక్టీరియా దాడిచేసి పాదాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ హానికారక క్రిములకు చెక్ పెట్టేందుకు వచ్చిందే.. ఆడర్ ప్రొటెక్టర్. షూ వేసుకునేముందు ఒకసారి పాదాలమీద, షూలోపల స్ప్రే చేస్తే చాలు. బ్యాక్టీరియాకు చెక్ పెట్టినట్టే. దుర్వాసన కూడా రాదు. దీని తయారీలో రసాయనాలను వాడలేదట. అంటే, పర్యావరణ హితమైంది కూడా. ఈ స్ప్రే ధర రూ.699 (500మి.లీ).

పెబుల్ థండర్
పార్టీలు, ఫంక్షన్లు అంటే మ్యూజిక్ ఉండాల్సిందే. పాటలు, డ్యాన్సులతో అదిరిపోవాల్సిందే. శుభకార్యాలే కానక్కర లేదు. నలుగురు స్నేహితులు పోగైనప్పుడు కూడా గానాబజానాతోనే జోష్ వస్తుంది. పెద్దపెద్ద ఫంక్షన్లు అయితే డీజేలు, స్పీకర్లు పెట్టించొచ్చు. చిన్నపాటి గెట్-టుగెదర్స్ మాటేమిటి? ఇలాంటి సందర్భాల్లోనూ హుషారు నింపేందుకు వచ్చిందే.. పెబుల్ థండర్ స్పీకర్. బ్లూటూత్‌తో దీన్ని ఫోన్‌కు కనెక్ట్ చేస్తే చాలు. నచ్చిన పాటలు వినొచ్చు. రెండు గంటలు చార్జ్ చేస్తే ఐదు గంటలసేపు ఆగకుండా అలరిస్తుంది. దీని ఆన్లైన్ ధర. రూ. 4,949.
Read More :
“Naya Mall | రోజూ పొద్దున్నే బ్రష్ చేయడం బద్దకంగా ఉందా.. ఈ డివైజ్ మీకోసమే”
Naya Mall | ఆడ, మగ ఇద్దరూ వేసుకునే ఈ నగల గురించి తెలుసా”
మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా జాగా లేదని ఫీలవుతున్నారా? ఒకసారి వీటిపైపు ఓ లుక్కేయండి”
“Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

