పొద్దున లేవగానే బ్రష్ చేసుకోవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది చాలామందికి. అలాంటి వారికోసం వచ్చేసింది ‘సురి ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్’. ఒక చార్జింగ్‌తో వారం రోజులు పని
చేస్తుంది. ఒకసారి నోట్లో పెట్టుకుంటే.. నిమిషానికి 33 వేలసార్లు వైబ్రేట్ అవుతుంది. అంటే మనం కష్టపడాల్సిన పనిలేకుండా చక్కగా దంతాలు తోమేస్తుందన్నమాట.
అల్యూమినియం బాడీతో బలంగా ఉండే ఈ బ్రష్ పై భాగాన్ని మాత్రం చెట్ల బెరడుతో తయారుచేస్తారు. పర్యావరణ హితమైన ఈ బ్రష్ ధర రూ. 7200 మాత్రమే.
పూర్తి వివరాలకు trysuri.com.
మామూలుగా షూ కొనాలంటే పరుగెత్తడానికి, నడవడానికి సౌకర్యంగా ఉన్నాయో లేదో చూస్తాం. కానీ గ్జియో(ixigo) కంపెనీ రూపొందించిన హైటెక్ షూస్ కెమెరా, బ్యాటరీ, సెన్సర్లతో నవతరానికి నచ్చేలా ఉన్నాయి. ఈ స్మార్ట్ షూస్‌కి ముందు, వెనుక కెమెరాలతోపాటు యూఎస్బీ చార్జింగ్ పాయింట్ ఉంటుంది. దీంతో ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. షూస్‌ను
మొబైల్‌తో కనెక్ట్ చేసుకుంటే చాలు సెల్ఫీలు తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. వీటిలో ఉండే సెన్సర్ల కారణంగా ఎవరైనా దొంగిలించినా, మనమే ఎక్కడైనా మరిచిపోయినా ఇట్టే తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు shoes.ixigo.com.
రేడియో అంటే చాలు.. బటన్లు, స్పీకర్లతో ముచ్చటగా కనిపించే బుల్లిపెట్టె గుర్తుకొస్తుంది. టీవీలు, ఫోన్ల వాడకం ఎక్కువైపోవడంతో బుల్లి రేడియోలు కనుమరుగైపోయాయి. ఆనాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా సరికొత్త హంగులతో బంగారు వన్నె బుల్లి రేడియో స్పీకర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ‘ఐగేర్ గోల్డీ’ బ్రాండ్ స్పీకర్లు ఎఫ్ఎంతో పాటు బ్లూటూత్, యూఎస్బీ, మెమరీ కార్డుకు అనుసంధానం అవుతాయి. దీన్ని సోలార్ పవర్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. స్పీకర్లో ఒక టార్చ్ కూడా ఉంటుంది. గోల్డ్ అండ్ బ్లాక్‌లో వింటేజ్ లుక్‌లో.. ఆన్లైన్ ధర రూ. 2000/-.
రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. కానీ రోజూ కోడి గుడ్లు ఉడకబెట్టడమంటే అంత సులభమైన పని కాదు. ఆ బాధ్యత స్వీకరించడానికి సరికొత్త ఎగ్ బాయిలర్ వచ్చేసింది. కరెంట్‌తో పనిచేసే ఈ బాయిలర్‌లో కొన్ని నీళ్లుపోసి ప్లేట్లో గుడ్లను పెట్టి మూతపెడితే చాలు. పదే పది నిమిషాల్లో ఆవిరిపై ఉడికించిన గుడ్లు సిద్ధం అయిపోతాయి. సైజును బట్టి ఒకేసారి ఆరు నుంచి పది గుడ్లను ఉడికించుకోవచ్చు. కొన్ని మోడల్స్‌లో డబుల్ ప్లేట్లు కూడా వస్తాయి. అంటే రెండు వరుసల్లో గుడ్లు పేర్చుకోవచ్చు. ఇందులో కూరగాయల ముక్కలనూ ఉడికించుకోవచ్చు. ఆన్లైన్ ప్రారంభ ధర రూ.500/-.
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
“మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా జాగా లేదని ఫీలవుతున్నారా? ఒకసారి వీటిపైపు ఓ లుక్కేయండి”
Naya Mall | ఆడ, మగ ఇద్దరూ వేసుకునే ఈ నగల గురించి తెలుసా”
“Naya Mall | అనారోగ్యంగా ఉందా? ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోనే బాడీ స్కానింగ్ చేసుకోవచ్చు”
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..”