Naya Mall | ఈ ఒక్క బాటిల్ ఉంటే ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్ ఏవీ అక్కర్లేవు
Naya Mall | స్మార్ట్ బాటిల్ ( Smart Bottle )
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఓ వాటర్ బాటిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘హైడ్రేట్‌స్పార్క్’ పేరుతో వచ్చిన ఈ బాటిల్‌కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఈ బాటిల్ ఒక్కటి ఉంటే చాలు.. ఫ్రిజ్, ఫిల్టర్ మన వెంట ఉన్నట్టే. ఇది 24 గంటలపాటు నీటిని చల్లగా ఉంచుతుంది. ఇందులోనే వడపోత వ్యవస్థ కూడా ఉంది. ఈ బాటిల్‌కి అమర్చిన సెన్సర్.. మనం ఎంత నీటిని తాగుతున్నామో లెక్కిస్తుంది. ఒకవేళ, మరీ తక్కువగా తాగితే హెచ్చరిస్తుంది. దీన్ని ఫోన్‌తో కనెక్ట్ చేసుకుని వయసు, బరువుకు తగినట్లు ఎంత నీరు అవసరమో తెలుసుకోవచ్చు. నాలుగు వేరియేషన్లలో అందుబాటులో ఉన్న ఈ బాటిల్ ఆన్లైన్ ప్రారంభ ధర రూ.4,600.

పవర్ ఫుల్ బ్యాంక్
ఈ రోజుల్లో ఫోన్, బ్లూటూత్, ఐపాడ్, ల్యాప్‌టాప్ నిత్యావసరాలుగా మారాయి. ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు పవర్ బ్యాంక్‌తో వీటన్నిటికీ చార్జింగ్ పెట్టాలంటే.. కొంచెం కష్టమే! ఈ సమస్యకు పరిష్కారంగా యు అండ్ ఐ(U&I) సంస్థ స్విచర్ సిరీస్ పవర్ బ్యాంక్‌ను తయారుచేసింది. దీంతో ఒకేసారి యూఎస్బీ, టైప్-సి, మైక్రో యూఎస్బీ కనెక్టర్లతో ఏడు గ్యాడ్జెట్స్‌ను చార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, మొబైల్ ఫోన్‌ను మూడుసార్లు ఫుల్‌చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్లాష్ లైట్ సౌకర్యం కూడా ఉంది. సంవత్సరం గ్యారెంటీ గల ఈ పవర్ బ్యాంక్ ఆన్లైన్ ధర రూ.2,999.

ఆమ్రపాలి నగలు
ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ నగల్ని నేటి తరానికి నప్పేలా రూపొందిస్తూ ఆధునిక మగువలకు చేరువైంది ప్రముఖ జువెలరీ డిజైనర్ ఆమ్రపాలి. దేవాలయాల గోడలు, గోపురాల డిజైన్లే ఆమెకు స్ఫూర్తి. బంగారం, వెండి, ప్లాటినమ్.. ప్రతి లోహమూ ఆమెకు ముడిసరుకే. రాళ్లు, పూసలు, ముత్యాల మేళవింపుతో 3డీ ఎఫెక్ట్స్నూ తీసుకొస్తున్నారు. ఈ నగలు రూ.6,000 నుంచి అందుబాటులో ఉన్నాయి.

అందమైన లాంతర్లు
ఒకప్పుడు చీకటి పడగానే ప్రతి ఇంట్లో మిణుకుమిణుకుమంటూ వెలిగేవి కిరోసిన్ లాంతర్లు. కరెంటు రాకతో లాంతర్లు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని నేటి తరానికి సరిపోయేలా తీర్చిదిద్దుతున్నారు.. రకరకాల లోహాలతో అందమైన అల్లికలతో కొవ్వొత్తుల లాంతర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పెద్దపెద్ద భవంతులలో, హోటళ్లలో వీటి హంగామా మామూలుగా ఉండదు. వీటి ఆన్లైన్ ధర: రూ.5,500.
Read More :
“Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
“Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి”
ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

