Urbanista | ఈ హెడ్‌ఫోన్స్‌కు లైఫ్ టైమ్ చార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు !!
Urbanista Los Angeles Headphones | చార్జింగ్ పెట్టక్కర్లేదు
ప్రస్తుతం హెడ్‌ఫోన్స్ వాడకం పెరిగిపోయింది. రకరకాల ఫీచర్స్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. అర్బనిస్టా లాస్ఏంజల్స్ అనే సంస్థ సరికొత్త హెడ్ ఫోన్స్‌ను విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్స్‌కు చార్జింగ్ పెట్టే పన్లేదు. బెడ్‌లైట్ నుంచి సన్‌లైట్ దాకా ఏ కాంతినైనా ఉపయోగించుకుని దానంతట అదే రీచార్జ్ అవుతుంది. అన్లిమిటెడ్ ప్లేబ్యాక్ టైమ్తోపాటు దాదాపు 80 గంటల బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్స్తోనూ పనిచేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్‌ను అర్బనిస్టా యాప్‌తో లింక్ చేసి వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. నవతరం మెచ్చే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ధర కూడా మరీ ఎక్కువేం కాదు. ఆన్లైన్ ధర రూ. 23,749.

తేనెలూరే పెదాల కోసం
అందమైన పెదాలను దొండపండుతో పోలుస్తారు కవులు. అధర సౌందర్యం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు మహిళలు. అంతకష్టం ఎందుకు? వంటింటి చిట్కాను పాటించి.. ఇంట్లోని మీగడ, నెయ్యితో కూడా పెదాలను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇలాంటి సహజసిద్ధ పదార్థాలతో తయారైనదే ‘ఎన్ బ్యూటీస్ లిప్ బామ్’. స్వచ్ఛమైన నెయ్యితో తయారైన ఈ బామ్ పూసుకుంటే పెదాలు పొడిబారకుండా తేమగా ఉంటాయి. దీనిలోని కుంకుమ పువ్వు, రైస్‌బ్రాన్ ఆయిల్, బాదం నూనె, ఆముదం పెదాలను సహజమైన ఎరుపురంగులోకి తీసుకొస్తాయి. ఆన్లైన్ ధర రూ.149 మాత్రమే. మరిన్ని వివరాలకు www.ennbeauty.com.

చిటికెలో చెప్పేస్తుంది
ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. సాంకేతికత సాక్షిగా మరిన్ని హంగులూ రంగులూ పుట్టుకొచ్చాయి. ఒక్కోసారి ఏదైనా రంగును చూసినప్పుడు, అది ఏ వర్ణమన్నది కచ్చితంగా పోల్చలేం. అలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.. నిక్స్ మినీ కలర్ సెన్సర్. ఇది చిటికెలో రంగులను గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని ఏదైనా వస్తువు మీద పెడితే చాలు.. వర్ణ రహస్యం తెలిసిపోతుంది. ఆ రంగు రావాలంటే ఏఏ రంగుల్ని ఎంత శాతం కలపాలనేదీ చెబుతుంది. ఈ చిట్టి పరికరం దాదాపు రెండు లక్షల రంగుల్ని గుర్తించగలదు. ఆన్లైన్ ధర రూ.7,600. పూర్తి వివరాలకు nixsensor.com చూడవచ్చు.

అందమైన కురులకు..
నల్లగా నిగనిగలాడే పొడవాటి కురులను కోరుకోని మగువ అంటూ ఉంటుందా? ఆ ప్రయత్నంలో రసాయన ఉత్పత్తుల కంటే.. ప్రకృతి సిద్ధంగా తయారైనవే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రముఖ కాస్మొటిక్స్ సంస్థ ఇండాలో జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి మేలుచేసే పదార్థాలతో తయారైన షాంపూను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో అరటి, కలబంద, మందారం ప్రధాన దినుసులు. వైట్ టీని కూడా జోడించారు. రసాయనాల జాడే లేదని చెబుతారు తయారీదారులు. ఈ షాంపూ 200 మి.లీ ఆన్లైన్ ధర రూ.329. వివరాలకు indalo.in చూడవచ్చు.
Read More :
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!
YogiFi | ఈ మ్యాట్ ఉంటే మీ ఇంట్లోనే ఈజీగా యోగా నేర్చుకోవచ్చు !!
“Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి”
“ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- head phones
- Naya mall
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

