YogiFi | ఈ మ్యాట్ ఉంటే మీ ఇంట్లోనే ఈజీగా యోగా నేర్చుకోవచ్చు !!
Naya Mall | స్మార్ట్ మ్యాట్
శరీరాన్ని అందంగా, పొందికగా తీర్చిదిద్దుకోవాలని అందరికీ ఉంటుంది. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ వంటివి కూడా చేస్తుంటారు. వీటివల్ల మనసూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ బయటికి వెళ్లే తీరికలేనివారి పరిస్థితి ఏమిటి? అలాంటి వారికోసం వచ్చిందే.. యోగిఫై( YogiFi )స్మార్ట్ మ్యాట్. ఈ చాప ఓ గురువులా వ్యవహరిస్తుంది. మన వ్యాయామాన్ని పరిశీలిస్తుంది. అందులో లోటుపాట్లను కనిపెడుతుంది. ఇన్‌బిల్ట్ సెన్సర్లతో రూపొందిన ఈ మ్యాట్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే చాలు. ఏ వ్యాయామం ఎంతసేపు చేయాలి, ఏయే వ్యాయామాలు చేయాలన్నదీ సూచిస్తుంది. మొబైల్ అప్లికేషన్‌తో పాటు మ్యాట్ ఆన్లైన్ ధర రూ.15,000. వివరాలకు yogifi.co.in చూడవచ్చు.

కంచు కళ
ప్రాచీన వస్తువుల విలువ రోజురోజుకూ పెరిగిపోతున్నది. అలనాటి విగ్రహాలు, శిల్పాలకు ఎనలేని ఆదరణ ఉంది. కాకపోతే, ఏ కుబేరులో వాటిని వేలంపాటల్లో కొనగలరు. చూడ్డానికి యాంటిక్స్లా కనిపించే వస్తువులకూ మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా కంచు విగ్రహాల తయారీలో పేరొందిన రతన్కృష్ణ ప్రాణంపోసిన మెడిటేషన్ బుల్, రోరింగ్ బుల్ బొమ్మలు అంతర్జాతీయ కళాభిమానులనూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈ మెడిటేషన్ బుల్ ధర దాదాపు రెండున్నర లక్షలు. ఇది Kynkyny.comలో అందుబాటులో ఉంది.

పిల్లల ఫోన్
ఏ టూర్‌కో వెళ్లినప్పుడు పిల్లల చేతిలో ఫోన్ ఉంటే నిశ్చింతగా అనిపిస్తుంది. కానీ, ఆ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్స్ కారణంగా ఎక్కడ పక్కదారిపడతారో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. ఇక ఆ అనుమానం అక్కర్లేదు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈజీఫోన్(Esayfone)లో కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం.. అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. జీపీఎస్ ట్రాకర్, అలర్ట్ సైరన్, ఆటో కాలింగ్‌తోపాటు హెల్ప్ బటన్ కూడా జోడించారు. పిల్లలు తేలిగ్గా ఫోన్ చేసేందుకు వీలుగా కీబోర్డుకు బదులు బటన్స్ ఉంటాయి. వీటిమీద ఫొటోలు అంటించి, నంబర్లు సెట్ చేసిపెట్టుకుంటే చాలు. ఆన్లైన్ ధర. రూ.3,999 మాత్రమే. మరిన్ని వివరాలకు easyfone.in చూడవచ్చు.

అక్షరానికి ఆసరా
సుప్రసిద్ధ కలాల తయారీ సంస్థ విలియమ్ పెన్ రెండు కొత్త పెన్నులను మార్కెట్లో విడుదల చేసింది. ఫౌంటెన్ పెన్నులకు విలియమ్ బ్రాండ్ పెట్టింది పేరు. సెయిలర్ సిరీస్‌లో భాగంగా.. ‘ఆటమ్ స్కై’, ‘బ్లూ డాన్’ అనే మరో రెండు పెన్నులను జతచేసింది. ఈ రెండు కలాలూ ముచ్చటైన రంగుతో, అందమైన తీరుతో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ధరలు రూ.19,500 నుంచి మొదలవుతాయి. వివరాలకు williampenn.net చూడవచ్చు.
Read More :
Naya Mall | ఈ ఒక్క బాటిల్ ఉంటే ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్ ఏవీ అక్కర్లేవు”
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే మీ మాటలు బయటకు వినిపించవు..”
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
Naya Mall | ఈ బాటిల్లో ఎంత మురికి నీళ్లు పోసినా.. ఫిల్టర్ నీళ్లలా మారిపోతాయి”
Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

