ఈ బ్రష్‌తో మీ అంతట మీరే ఈజీగా జుట్టుకు కలర్ వేసుకోవచ్చు
Naya Mall | చక్కగా రంగేస్తుంది
జుట్టుకు రకరకాల రంగులు వేసుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఎరుపు, నలుపు అనే తేడా లేకుండా వింతవింత వర్ణాలు అద్దుతున్నారు. అంతేకాదు, తెల్ల జుట్టును నల్లరంగుతో కవర్ చేయడానికి నానా తంటాలూ పడాలి. అయితే, ఏ ఇబ్బందీ లేకుండా ఎవరికివారే రంగేసుకునేలా ‘కలర్సోనిక్ ( Colorsonic )’ అనే సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది కాస్మొటిక్ సంస్థ లోరియల్. ఈ ఎలక్ట్రికల్ సెన్సర్ బ్రెష్‌తో జుట్టు కుదుళ్ల నుంచీ చక్కగా రంగేసుకోవచ్చు. అంతేకాదు దీనిలో ఉండే సెన్సర్ నలభై రకాలుగా రంగుల్ని కలపగలదు. అంటే నలభై షేడ్స్‌లో కేశాలను నిగనిగలాడేలా చేస్తుందన్నమాట. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ బ్రష్ గురించిన పూర్తి వివరాలకు loreal.com లో చూడవచ్చు.

చిట్టి వాక్యూమ్ క్లీనర్
ఎంత చక్కగా ఇల్లు తుడిచినా కంటికి కనపడని సూక్ష్మక్రిములు మూలల్లో చేరిపోయి రకరకాల వ్యాధులను కలిగిస్తాయి. కుటుంబాన్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. ఆ ఇబ్బంది లేకుండా ఏ మూలనున్న దుమ్మునైనా చిటికెలో మాయం చేసేందుకు వచ్చేసిందే.. డస్టర్ బాట్ ఎక్స్(Dustor bot X). ఈ చిట్టి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌తో అరలు, మూలలు, మంచాలు, సోఫాల కింద.. ఎక్కడైనా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. దీనిలోని సెన్సర్ ఎక్కడ దుమ్ము ఉన్నా కనిపెట్టేస్తుంది. ఆన్లైన్ ధర రూ.14,990. మరిన్ని వివరాలకు dustor.com చూడవచ్చు.
చెదలు పట్టకుండా..
ఎంత జాగ్రత్తగా ఉన్నా బీరువాలు, వార్డ్‌రోబ్‌లలో బొద్దింకలు, చెదలు వంటి కీటకాలు చేరిపోతూ ఉంటాయి. దుస్తులు, పుస్తకాలను పాడు చేస్తూనే ఉంటాయి. వీటి బెడద తగ్గించడానికే ఘాటైన వాసనగల నాఫ్తలిన్ బిళ్లలను వాడతారు. అయితే నాఫ్తలిన్ గాఢత అందరికీ పడదు. ఎక్కువసేపు పీల్చడం ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. వీటి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చేశాయి.. సెడార్ వుడ్ మాత్‌బాల్స్. ఘాటైన వాసన కలిగిన సెడార్ వుడ్‌తో తయారు చేస్తారు వీటిని. నేరుగా దుస్తులు, పుస్తకాల మధ్య పెట్టేయవచ్చు. పెద్దపెద్ద చెక్కలకైతే హ్యాంగింగ్స్ కూడా వస్తాయి. నిమ్మ, నారింజ, కర్పూరం, సిడార్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. 20 బాల్స్గల ప్యాకెట్ ధర ఆన్లైన్లో రూ.200-రూ.800 వరకూ ఉంటుంది.

సరికొత్త సైక్లింగ్
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోడానికి ఒకటే మార్గం.. వ్యాయామం. అందులోనూ సైక్లింగ్ అనేది తిరుగులేని కసరత్తు. నిపుణులు కూడా ఇదే మాట చెబుతుండటంతో సైక్లింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. దానికి అనుగుణంగానే మార్కెట్లోకి రకరకాల ఫీచర్స్‌తో ఎక్సర్సైజ్ సైకిల్ మోడల్స్ వస్తున్నాయి. ప్రముఖ ఇంటీరియర్ ఫర్నీచర్ డిజైనర్ సంస్థ అయోటా(IOTA) రొటీన్‌కి భిన్నంగా స్లొటే(Ciclotte) అనే సరికొత్త ఎక్సర్సైజ్ బైక్‌ను రూపొందించింది. గోళాకారంగా ఉండే ఈ బైక్‌కు సీట్, హ్యాండిల్స్, పెడల్స్ మాత్రమే ఉంటాయి. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని ఇంట్లో ఎక్కడైనా అమర్చుకునే వీలుంది. ఈ డిజైనర్ బైక్‌ను మొబైల్ యాప్‌తో అనుసంధానం చేస్తే ఎంత సమయం సైక్లింగ్ చేశాం, ఎంత దూరం తొక్కాం, ఎన్ని క్యాలరీలు కరిగాయనే సమాచారం నేరుగా ఫోనుకు చేరుతుంది. పూర్తి వివరాలకు ciclotte.com చూడవచ్చు.
Read More :
“ఇక మీ ఇంటి తాళాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లాక్ చేయొచ్చు”
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
YogiFi | ఈ మ్యాట్ ఉంటే మీ ఇంట్లోనే ఈజీగా యోగా నేర్చుకోవచ్చు !!”
“Naya Mall | ఈ ఒక్క బాటిల్ ఉంటే ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్ ఏవీ అక్కర్లేవు”
ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

