Naya Mall | ఈ సూట్‌కేస్‌తో ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు.. పాటలు వినొచ్చు
Naya Mall | Smart Case- స్మార్ట్కేస్
నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్లాలంటే రెండు మూడు బ్యాగులు సర్దాల్సిందే. చివరికి వచ్చేసరికి, ఎందులో ఏం పెట్టామన్నది గుర్తుండదు. మొత్తం వెతకాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేసిందే ‘తుమి రేజర్’ సూట్‌కేస్. తేలికగా ఉన్నా.. దృఢమైన లోహంతో తయారుచేసిన ఈ సూట్‌కేస్‌లో సామాన్లు, దుస్తులు విడివిడిగా సర్దుకునేందుకు అనువుగా అరలు ఉంటాయి. 360 డిగ్రీల కంఫర్ట్ వీల్స్‌తో ఎటంటే అటూ తేలిగ్గా లాగవచ్చు. పాటలు వినేందుకు, ఫోన్ చార్జింగ్కు యుఎస్బీ పోర్ట్ కూడా ఉంటుంది. ఇన్‌బిల్ట్ జీపీఎస్ ట్రాకర్ కారణంగా మన సూట్‌కేస్‌ను ఎవరూ దొంగలించలేరు. దీని ఆన్లైన్ ధర రూ.70,000. పూర్తి వివరాలకు razer.com చూడవచ్చు.

సరి‘జోడు’
పెండ్లి అంటేనే ఓ అందమైన వేడుక. ఆ వైభోగమంతా వధువు చుట్టే తిరుగుతుంది. పెండ్లికూతురికు ఖరీదైన దుస్తులు, ధగధగలాడే నగలే కాదు.. వాటికి సరితూగే చెప్పులూ అవసరమే. అందుకోసమే ‘స్టెప్ అవుట్ ఇన్ ైస్టెల్’ పేరుతో స్పెషల్ వెడ్డింగ్ వేర్‌ను తీసుకొచ్చింది ‘హౌస్ ఆఫ్ వేన్’ సంస్థ. భారీ డిజైనర్ దుస్తులకు నప్పేలా కుందన్లు, ముత్యాలు, రాళ్లు, వజ్రాలు, జరీ, రంగురంగుల ఎంబ్రాయిండరీ సొగసులద్దిన ఈ చెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ జోళ్లు ట్రెడిషనల్ వేర్‌తోపాటు ట్రెండీ వేర్పైనా నప్పుతాయి. వీటి ఆరంభ ధర రూ.4,590. వివరాలకు houseofvain.com చూడవచ్చు.

కెవ్వు.. కొవ్వొత్తులు!
అందంగా మలుచుకున్న ఇంటికి అదనపు ఆకర్షణ ఆకట్టుకునే కొవ్వొత్తులే! ఆ కాంతి ఇంటికి కొత్తశోభను తెస్తుంది. భిన్న ఆకృతుల్లో, సప్త వర్ణాల్లో వెలుగులతోపాటు పరిమళాలనూ వెదజల్లుతుంటే.. హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది కదా! అందుకే, రాడ్లివింగ్ సంస్థ సరికొత్త క్యాండిల్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సోయా మైనంతో రూపొందించే ఈ క్యాండిల్స్ గులాబీ, లావెండర్, మల్లె తదితర సువాసనలలో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.699. వివరాలకు radliving.in చూడవచ్చు.

సొగసరి విటమిన్
అందంగా కనిపించడానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు మగువలు. వారిని నవయవ్వనంగా మార్చేందుకు వచ్చేసింది.. స్కిన్‌ఆర్‌ఎక్స్(SKINRX). ప్రముఖ కాస్మొటిక్స్ సంస్థ
నైకా ఈ ఫేస్ సీరమ్‌ను విడుదల చేసింది. రంగును పెంచి, వయసును తగ్గించడం దీని ప్రత్యేకత అని చెబుతారు తయారీదారులు. చర్మకణాలను కంటికి రెప్పలా రక్షిస్తూ ముఖంపై ముడతలు పడకుండా చూస్తుంది. నియాసినమైడ్, ఫెరులిక్ యాసిడ్‌తోపాటు చర్మాన్ని మెరిపించే విటమిన్-సి మిశ్రమంతో దీన్ని తయారుచేశారు.ఎలాంటి స్కిన్టోన్కైనా సరిపోయే ఈ పైపూత ఆన్లైన్ ధర రూ.699 (30 మి.లీ).
Read More :
Naya Mall | ఈ కప్‌లో కాఫీ పోస్తే ఎంతసేపైనా వేడి వేడిగానే ఉంటుందట!!”
“ఈ బ్రష్‌తో మీ అంతట మీరే ఈజీగా జుట్టుకు కలర్ వేసుకోవచ్చు”
“Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

