Hair Mask | ఇది మీ జుట్టుకు మాస్క్‌లాంటిది.. చుండ్రు సమస్యను ఇట్టే తగ్గిస్తుంది
Naya Mall | అరటి సుగుణాలతో
నల్లగా నిగనిగలాడే ఆరోగ్యకరమైన జుట్టుకోసం రకరకాల షాంపూలు, కండిషనర్లు వాడుతూనే ఉంటాం. ఆ ఇబ్బంది లేకుండా.. రసాయనాల జాడలేని సహజ సిద్ధమైన పదార్థాలతో తయారైన హెయిర్ మాస్క్ ( Hair Mask )ను తీసుకొచ్చింది సౌందర్య సాధనాల సంస్థ ఫ్లాసమ్. అల్లం, చార్కోల్, విటమిన్-బి5తోపాటు అరటిపండులోని పోషకాలతో తయారుచేసిన ఈ మాస్క్ చుండ్రు, చివర్లు చిట్లడం వంటి సమస్యలను తగ్గించి మంచి కండిషనర్‌గానూ పనిచేస్తుంది. జుట్టును కుదుళ్లనుంచీ దృఢంగా మార్చడంతోపాటు తగినంత తేమను కలిగి ఉండేలా చూస్తుంది. వైల్డ్ బనానా, ఇంకీ బెర్రీస్, కేక్ థెరపీ వంటి ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్న ఈ హెయిర్ మాస్క్ ఆన్లైన్ ధర రూ.799 (200గ్రా). వివరాలకు inflawsome.com చూడవచ్చు.

అందమైన బకెల్
చేతి బ్యాగులు.. అతివలకు అలంకరణే కాదు, అవసరం కూడా. వీధి దాటాలన్నా చేతిలో బ్యాగ్ ఉండాల్సిందే. కాబట్టే, ‘రోజర్ వివర్’ సంస్థ అందమైన బకెల్ను జతచేసి మరీ ఓ సరికొత్త బ్యాగ్‌ను రూపొందించింది. దానికి ఓ బంగారు గొలుసును జతచేసింది. దీని ధర సుమారు రూ.1,60,190. ఈ బకెల్ను బెల్ట్, చెప్పులకు కూడా జోడించుకోవచ్చు.

పూల సొబగులు..
ప్రకృతి అందానికి చిరునామా పూలు. ఆ అందాలను ఏ వస్తువుపై అద్దినా మరింత మెరుపు ఖాయం. మగువల దుస్తుల్లోనూ పూల డిజైన్లదే పైచేయి. తాజాగా ఎవర్బ్లూమ్ సంస్థ పూల సొబగులు అద్దిన అనార్కలీ, సహస్ర అనే సూట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఎత్నిక్వేర్లో ఫ్లోరల్ ప్రింట్ జతగా, మారుమూల పల్లెల్లోని డిజైనర్లు వీటికి ప్రాణంపోయడం ఓ ప్రత్యేకత. ఆన్లైన్లో ప్రారంభ ధర రూ. 8,500.

రెయిన్బో షూస్
ఏదో ఒక రంగులోనో, రెండు మూడు రంగుల కలయికతోనో తయారైన షూస్ చూసే ఉంటారు. అయితే ఇంద్ర ధనుస్సులోని రంగులన్నీ అద్దుకున్న షూస్ ఎప్పుడైనా చూశారా? సప్తవర్ణాల మేళవింపుతో సరికొత్త పాదరక్షల్ని మార్కెట్లోకి విడుదల చేసింది ‘బీయునీక్’ సంస్థ. సమాజంలో వివక్షకు గురవుతున్న ఎల్జీబీటీ వర్గానికి వీటిని అంకితం చేసింది. పైన లెదర్‌తో, కిందిభాగం సింథటిక్ మెటీరియల్‌తో తయారైన ఈ షూస్ ఆన్లైన్ ధర రూ.2,999. పూర్తి వివరాలకు beunic.com చూడవచ్చు.
Read More :
“Naya Mall | ఈ గ్యాడ్జెట్‌తో జర్నీలో ఉన్నప్పుడు మీ కాఫీని మీరే రెడీ చేసుకోవచ్చు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

