Naya Mall | ఈ గ్యాడ్జెట్‌తో జర్నీలో ఉన్నప్పుడు మీ కాఫీని మీరే రెడీ చేసుకోవచ్చు
Naya Mall | జర్నీ లో.. కాఫీ మేకర్
ప్రయాణాల్లో వేడివేడి కాఫీ తాగాలనిపిస్తే ఏ రెస్టారెంట్ దగ్గరో ఆగాల్సిందే. కప్పు చేతికి వచ్చేసరికి అరగంట పట్టవచ్చు. ఆ ఎదురుచూపులు లేకుండా వచ్చేసింది.. ‘వాకాకో నానో ఎస్ప్రెస్సో’ కాఫీ మేకర్. ఈ బుల్లి కాఫీ మేకర్‌తో ఐదు నిమిషాల్లో వేడివేడి ఎస్ప్రెస్సో కాఫీ తయారైపోతుంది. చార్జింగ్‌తో పనిచేసే ఈ కాఫీ మేకర్లో కప్పు, ఫిల్టర్ కూడా ఉంటాయి. కాస్త కాఫీ పౌడర్, చక్కెర, పాలు లేదా పాలపొడి ఉంటే చాలు కాఫీ తాగేయొచ్చు. ఇవేవీ లేకపోయినా ఇన్స్టంట్ మిక్స్తోనూ వేడివేడిగా ఆస్వాదించవచ్చు. దీని ఆన్లైన్ ధర రూ.5,699. పూర్తి వివరాలకు somethingsbrewing.in చూడవచ్చు.
ఇత్తడి కళ!
రంగులోనూ, రూపంలోనూ పుత్తడికి ఏమాత్రం తీసిపోదు.. ఇత్తడి. అందుకే చవకైన ఇత్తడితో రకరకాల నగలను తయారుచేస్తూ అతివలను ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు. అందుబాటు ధరలోని ఈ నగలంటే మహిళలూ మక్కువ చూపుతున్నారు. తాజాగా ప్రముఖ నగల తయారీ సంస్థ ఓటీఎమ్ ఇత్తడితో చేసిన చెవి కమ్మలను మార్కెట్లో విడుదల చేసింది. విభిన్నమైన
ఆకృతుల్లో ఉన్నాయీ నగలు. ఆన్లైన్లో వీటి ప్రారంభ ధర రూ.12,000.
రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో..
పాలిథిన్ కవర్లు, బాటిళ్ల రూపంలో సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. సముద్రం నుంచి తీసిన ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి రకరకాల వస్తువులను తయారుచేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి పలు సంస్థలు. తాజాగా ప్రముఖ గడియారాల తయారీ సంస్థ ‘ఆన్క్లీన్’.. రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో వాచీలను రూపొందించింది. భిన్న రంగుల్లోని ఈ గడియారాలు సంద్రాన్ని ప్రతిబింబించేలా.. అలలు, నీటి బిందువుల డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఈ గడియారం ఆన్లైన్ ధర రూ.12,990. పూర్తి వివరాలకు helioswatchstores.comలో చూడవచ్చు.
స్వచ్ఛమైన గాలికోసం..
ప్రస్తుత పరిస్థితుల్లో గుండెల నిండా గాలి పీల్చుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి. కాలుష్యానికి తోడు కరోనా వచ్చిచేరింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు డైసన్ సంస్థ రూపొందించిన ఆధునిక ఎయిర్ ప్యూరిఫయర్ ఇది. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇంట్లో, ఆఫీసులో గాలిని వడబోయడమే కాకుండా, పరిసరాల్లోని కాలుష్య తీవత్రను గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంట్లో వస్తువులు, గోడల రంగుల నుంచి వెలువడే ఫార్మాల్డిహైడ్‌ను కూడా ఇది నిలువరించగలదు. 0.1 మైక్రాన్ల పరిమాణంలో గల సూక్ష్మజీవులను సైతం వడకట్టి 99.95 శాతం స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దీని ఆన్లైన్ ధర రూ.52,900. పూర్తి వివరాలకు dyson.in చూడవచ్చు.
Read More :
“కీ ఎక్కడో పెట్టి మీరు మరిచిపోయినా ఈ డివైజ్ మాత్రం కనిపెట్టేస్తుంది”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

