పావురాలను ఇళ్లలో పెంచుకోవడం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రోజుల్లో సమాచారం చేరవేసేందుకు కూడా వీటిని నియోగించారు. కానీ పావురాల వల్ల అనేక వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా వీటి వ్యర్థాల్లోని కొన్ని పదార్థాలు ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఏమాత్రం హాని కలిగించకుండానే పావురాలను దూరంగా ఉంచేందుకు ఓ రిపెల్లెంట్‌ని తీసు కొచ్చింది క్లెన్స్టా. పర్యావరణ హిత పదార్థాలతో తయారుచేసిన ఈ ద్రవాన్ని స్ప్రే చేస్తే చాలు. పావురాలు ఆ పరిసరాల్లో కనిపించవు. స్ప్రే ఆన్లైన్ ధర రూ.699 మాత్రమే (రెండు రీఫిల్స్‌తో కలిపి). మరింత సమాచారానికి.. clensta.com ఉండనే ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనేది లెక్కపెట్టుకోక తప్పడం లేదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని అనుకునేవారు ఆహారం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేరు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడేవారి సంగతి చెప్పక్కర్లేదు. అలాంటి వారు కూడా ఇంట్లోనే సరైన డైట్ ప్లాన్ సిద్ధం చేసుకునేలా వచ్చిందే.. ఆక్టోఫిట్ న్యూట్రిషనల్ స్కేల్. తినే ఆహారం ఏదైనా సరే, ఈ పరికరంపై ఉంచితే చాలు.. ఎన్ని కేలరీల శక్తి ఇస్తుంది, ప్రొటీన్ శాతమెంత, కొవ్వు మాటేమిటి.. తదితర వివరాలు లెక్కగట్టి చెబుతుంది. దాదాపు రెండువేల ఆహార పదార్థాల్లోని పోషకాలను కచ్చితంగా తూకమేయగలదు. ఫోన్‌తో కనెక్ట్ చేసుకుంటే చాలు. కేలరీ కౌంట్ మొదలై
పోతుంది. ఆన్లైన్ ధర రూ. 1,999. పూర్తి వివరాలకు actofit.com చూడవచ్చు.
పెద్దపెద్ద సంబురాలకు దద్దరిల్లే మ్యూజిక్ అందించే డీజే ఉండనే ఉంది. చిన్నచిన్న పార్టీల సంగతేమిటి? అలాంటి వాటికోసం వచ్చేసిందే.. ఆమ్కెటే పాకెట్ బ్లాస్ట్. చూడ్డానికి చిన్నగానే ఉన్నా.. ఈ స్పీకర్ చెవులు హోరెత్తే మ్యూజిక్ అందిస్తుంది. దీనిలోని యాంటినాతో ఎఫ్ఎమ్ వినవచ్చు, యూఎస్బీతో ఫోన్, ల్యాప్ టాప్‌కూ కనెక్ట్ చేసుకోవచ్చు, మెమరీ కార్డు వేసుకుని నచ్చిన పాటలు ఆనందించవచ్చు. అంతేకాదు, ఇందులోని రికార్డింగ్ ఆప్షన్‌తో వాయిస్ నోట్స్ రికార్డ్ చేసుకునే వీలు కూడా ఉంది. ఆన్లైన్ ధర రూ. 1,499. మరిన్ని వివరాలు కావాలా? అయితే, amkette.com చూడండి.
వాకింగ్, జాగింగ్, రన్నింగ్.. ఇలా ఏ వ్యాయామం చేయాలన్నా షూస్ తప్పనిసరి. నిత్యం వాడటం వల్ల దుమ్ము, ధూళి పేరుకుపోయి షూస్‌పై మరకలు పడతాయి. బురద, మట్టి గుర్తులు ఎంత తుడిచినా పోవు. షూస్‌పై పడే మొండి మరకలను తొలగించి కొత్తగా మెరిసేలా చేసేందుకు స్నీకర్స్ క్లీనర్‌ను తీసుకొచ్చింది ఫిలిప్స్. బ్యాటరీతో పనిచేసే ఈ క్లీనర్ శుభ్రంగా దుమ్ము వదిలిస్తుంది. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అందుబాటులో ఉన్న ఈ క్లీనర్ ఆన్లైన్ ధర రూ. 2,595. ఆసక్తి ఉంటే.. philips.com చూడవచ్చు.
ఫోన్లో చార్జింగ్ అయిపోతే వెంటనే చార్జ్ చేసుకోడానికి పవర్ బ్యాంక్‌లు ఉన్నమాట నిజమే. అయితే పవర్ బ్యాంక్‌లోనూ చార్జింగ్ అయిపోతే? ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా నెలరోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఫోన్, ల్యాప్‌టాప్ వంటి విద్యుత్ పరికరాలను చార్జ్ చేసేందుకు డిజైన్ చేసిందే.. షార్గ్రీక్ క్యాప్సూల్ గ్రావిటీ. కిక్‌స్టార్టర్ సంస్థ పరిచయం చేసిన ఈ క్యాప్సూల్ వివిధ ఉపకరణాలను చార్జ్ చేయడమే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా ఫోన్, స్మార్ట్‌వాచ్ వంటి పరికరాలను అక్కడి టైమ్ జోన్‌కు తగినట్లు సెట్ చేస్తుంది. యూఎస్బీ ద్వారా కనెక్ట్ చేస్తే టైమర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. గరిష్ఠంగా 90 నిమిషాల్లో ఎటువంటి పరికరాన్నయినా ఫుల్‌చార్జ్ చేస్తుంది. కేవలం మూడు అంగుళాలు ఉండే ఈ అల్ట్రామోడ్రన్ పవర్‌బ్యాంక్‌ను ఎక్కువగా అంతరిక్ష యాత్రికులు వాడుతారు. 20 వాట్స్ విద్యుత్ నిల్వ సామర్థ్యం అంటే మాటలు కాదు. దీని ఆన్లైన్ ధర రూ.4,000(సుమారు). ఆసక్తి ఉంటే.. Kickstarter.com చూడవచ్చు.
“Wireless Smart Charger | ఈ స్మార్ట్ ఛార్జర్‌తో ఒకేసారి మూడు డివైజ్‌లకు చార్జింగ్ పెట్టొచ్చు”