Wireless Smart Charger | ఈ స్మార్ట్ ఛార్జర్‌తో ఒకేసారి మూడు డివైజ్‌లకు చార్జింగ్ పెట్టొచ్చు
Naya Mall | ఒకేసారి మూడు గ్యాడ్జెట్స్ చార్జ్ చేసుకునేందుకు వీలుగా వచ్చేసిందే.. రీగర్ మాగ్ఫిక్స్ ట్రయో ( Raegr Magfix Trio ). దీంతో ఒకేసారి ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్‌బడ్స్ చార్జ్ చేసుకోవచ్చు.
Naya Mall | స్మార్ట్ చార్జింగ్ ప్యాడ్
స్మార్ట్ పరికరాల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు.. ఎటుచూసినా సాంకేతికతే. వీటిని వాడటం సులభమే కానీ చార్జింగ్ కష్టం. అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఒకేసారి మూడు గ్యాడ్జెట్స్ చార్జ్ చేసుకునేందుకు వీలుగా వచ్చేసిందే.. రీగర్ మాగ్ఫిక్స్ ట్రయో ( Raegr Magfix Trio ). దీంతో ఒకేసారి ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్‌బడ్స్ చార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టాండ్‌ను ముందే చార్జ్ చేసి పెట్టుకోవాలి. స్మార్ట్ ప్యాడ్లోని అయస్కాంతాలు గ్యాడ్జెట్స్ కిందపడకుండా పట్టి ఉంచుతాయి. దీన్ని ప్రత్యేకించి యాపిల్ పరికరాల కోసమే తయారుచేశారు. దాదాపు పన్నెండు ఫోన్లను చార్జ్ చేయగల సామర్థ్యం ఉంది. ధర రూ. 4,499. పూర్తి వివరాలకు raegr.com చూడవచ్చు.

అంతరిక్షంలోనూ రాసేస్తుంది
విమానాల్లో ప్రయాణించేవారు వెంట ఇంక్ పెన్ను తీసుకెళ్లకూడదని నియమం. ఎందుకంటే భూమి నుంచి పైకి వెళ్లేకొద్దీ పీడనంలో వచ్చే మార్పుల వల్ల ఇంకు బయటికి వచ్చే ప్రమాదం ఉంది. కానీ అంతరిక్షంలోనూ రాయగలిగే అరుదైన పెన్నును తీసుకొచ్చింది ఫిషర్ స్పేస్పెన్ సంస్థ. ఏజీ7-50ఎల్యీ సిరీస్‌తో విడుదలైన ఈ పెన్నులను విమానాలేం ఖర్మ, రాకెట్లలోనూ తీసుకెళ్లవచ్చు. అపోలో 11 స్పేస్‌క్రాఫ్ట్ నుంచి సేకరించిన ఖరీదైన లోహంతో తయారు చేసిన ఈ కలాన్ని.. చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా విడుదల చేశారు. ఆన్లైన్ ధర రూ. 60 వేలు మాత్రమే. ఆసక్తి ఉంటే Spacepen.com క్లిక్ చేయండి.

కాపాడే కన్ను
ఇంటా బయటా సీసీ టీవీల వాడకం అధికం అవుతున్నది. నేరాలు, ఘోరాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఆఫీసులు, ఇళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని అమర్చడం ఓ పెద్ద పని. ఆ ఇబ్బందేమీ లేకుండా నేరుగా మనమే కావలసిన చోట అమర్చుకునే వెసులుబాటుతో వచ్చేసింది గూగుల్ నెస్ట్ కెమెరా. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కెమెరాను వాల్మౌంట్ సాయంతో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రత్యేకమైన అయస్కాంతం వల్ల కిందపడే ప్రసక్తే లేదు. ఆరురెట్ల జూమ్ పిక్చర్తో స్పష్టత గ్యారెంటీ. క్వాలిటీ ఆడియో రికార్డ్ చీమ చిటుక్కుమన్నా గ్రహిస్తుంది. ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు కూడా. ఈ కెమెరా ప్రారంభ ధర రూ.11,999

పచ్చని ప్రకృతిలా..
పచ్చని ప్రకృతిని చూస్తే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఆకుపచ్చని రంగుతో అందమైన నగల సిరీస్‌ను రూపొందించారు ప్రముఖ డిజైనర్ సుసన్ రాక్ఫెల్లర్. తను ప్రాణంపోసిన.. అచ్చంగా సీతాకోకచిలుక వాలినట్టుండే ఉంగరాలు, పచ్చని రాళ్లను పొదిగిన కమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆభరణాల ప్రారంభ ధర రూ. 19,900. వివరాలకు Swarovski.com.
Read More :
“Naya Mall |సన్ గ్లాసెస్ కమ్ ఇయర్‌ఫోన్స్.. అదిరిపోయిన నయా గ్యాడ్జెట్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

