Naya Mall |సన్ గ్లాసెస్ కమ్ ఇయర్‌ఫోన్స్.. అదిరిపోయిన నయా గ్యాడ్జెట్
Qubo Go Audio Sunglasses | పిల్లలైనా, పెద్దలైనా సన్‌గ్లాసెస్‌ను ఇష్టపడతారు. ఇవి ఎండతీవ్రత నుంచి కళ్లను రక్షిస్తూనే స్టైలిష్ లుక్‌ను జతచేస్తాయి. వీటికి మరిన్ని ఫీచర్స్ జోడించి సరికొత్త కళ్లజోడును తీసుకొచ్చింది క్యుబో సంస్థ.
Naya Mall |ఆడియో గ్లాసెస్
పిల్లలైనా, పెద్దలైనా సన్‌గ్లాసెస్‌ను ఇష్టపడతారు. ఇవి ఎండతీవ్రత నుంచి కళ్లను రక్షిస్తూనే స్టైలిష్ లుక్‌ను జతచేస్తాయి. వీటికి మరిన్ని ఫీచర్స్ జోడించి సరికొత్త కళ్లజోడు ( Qubo Go Audio Sunglasses )ను తీసుకొచ్చింది క్యుబో సంస్థ. ఈ సన్‌గ్లాసెస్ బ్లూటూత్ స్పీకర్‌గానూ పని చేస్తాయి. ఫోన్‌కి కనెక్ట్ చేస్తే కాల్స్ ఆన్సర్ చేయవచ్చు, పాటలు వినవచ్చు. డ్రైవింగ్, రన్నింగ్, యోగా, షాపింగ్.. అన్ని సమయాల్లోనూ ఉపయోగించవచ్చు. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరుగంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఈ యూనిసెక్స్ గ్లాసెస్‌ను ఆడ, మగ.. ఎవరైనా ధరించవచ్చు. ఆన్లైన్ ధర రూ.5,990. మరిన్ని ఫీచర్స్ తెలుసుకోవాలని అనుకుంటే.. quboworld.com చూడవచ్చు.

ట్రెండీ బ్రేస్లెట్
ట్రెండ్‌కు తగినట్టు దుస్తులు ధరించడమే కాదు, వాటికి నప్పేలా జువెలరీని కూడా ధరిస్తే ఏ పార్టీలో అయినా మీరే సెలెబ్రిటీ. ట్రెండీవేర్కు మరింత స్టైలిష్‌లుక్ జతచేసేందుకు సరికొత్త బ్రేస్‌లెట్‌ను తీసుకొచ్చింది ప్రముఖ డిజైనర్ సంస్థ.. ఇరుమ్మే. ఈ ‘స్టాక్డ్ బ్రేస్లెట్స్’ ప్రత్యేక డిజైన్ అతివలను ఆకట్టుకుంటున్నది. గోల్డ్, సిల్వర్ మెరుపులతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ. 1,000. మరిన్ని డిజైన్ల కోసం.. erumme.com సందర్శించండి.

చక్కని కసరత్తు కోసం
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే వ్యాయామమే మార్గం. ఇంటా బయటా రకరకాల కసరత్తులు చేయడానికి భిన్నమైన సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కాళ్లు, చేతులు, నడుము.. ఒక్కో అవయవానికి ప్రత్యేకించి కాకుండా మొత్తం శరీరానికి చక్కని వ్యాయమం అందించడానికి వీలుగా రూపొందించిందే.. ఫ్లెక్స్ ట్రైయినర్ ప్లస్. ఫ్లెక్స్‌నెస్ట్ సంస్థ ఆవిష్కరించిన ఈ సాధనం పెడల్స్, హ్యాండిల్స్‌తో సైకిల్‌ను పోలి ఉంటుంది. దీంతో సాధన చేయడం వల్ల ఒంట్లో ప్రతి భాగానికి వ్యాయామం అందుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫోన్ ద్వారా కూడా స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ. 64,999. ఇదే కాదు, మరిన్ని వ్యాయామ పరికరాల కోసం theflexnest.com చూడండి.

స్వచ్ఛమైన గాలి సిద్ధం..
రోజురోజుకూ పెరిగిపోతున్న వాయుకాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి కరువైపోతున్నది. ఆ దుష్ప్రభావం ఊరిపితిత్తులను దెబ్బతీస్తున్నది. ఆస్తమాలాంటి వ్యాధులకు కారణం అవుతున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా.. వచ్చిందే ఆరారా ఎయిర్ మినీ. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ రెండు దశల్లో వడపోసి మరీ స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. తేలికగా వెంట తీసుకెళ్లగలిగే వీలున్న ఈ ప్యూరిఫయర్‌ను ఇల్లు, ఆఫీసు, కారు.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రయాణాల్లోనూ వెంటతీసుకెళ్లొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే అయిదు గంటలపాటు పనిచేస్తుంది. ఆన్లైన్ ధర రూ.13,000. వివరాలకు auraair.co.in క్లిక్ చేయవచ్చు.
Read More :
Naya Mall | ఈ చెప్పులు వేసుకుంటే టెన్షన్స్ అన్ని ఇట్టే మాయమైపోతుంది”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

