ఈ సైకిల్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
Naya Mall | సవారీకే కాదు ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లడానికి అనువుగా ఎలక్ట్రిక్ పి-లైన్ అనే సరికొత్త సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది బ్రాంప్టన్ సంస్థ. ఎలక్ట్రిక్ బ్యాటరీతో పనిచేసే ఈ సైకిల్ మీద గేర ్లసాయంతో నాలుగు విభిన్నమైన వేగాలలో ప్రయాణించవచ్చు
Naya Mall | మడత సైకిల్
పర్యావరణానికి హానిచేయని, మనిషికి కీడు కలిగించని ప్రయాణ సాధనం.. సైకిల్. దీనివల్ల శరీరానికి చక్కని వ్యాయామం కూడా. అయితే, సవారీకే కాదు ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లడానికి అనువుగా ఎలక్ట్రిక్ పి-లైన్ అనే సరికొత్త సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది బ్రాంప్టన్ సంస్థ. ఎలక్ట్రిక్ బ్యాటరీతో పనిచేసే ఈ సైకిల్ మీద గేర ్లసాయంతో నాలుగు విభిన్నమైన వేగాలలో ప్రయాణించవచ్చు. మన ఎత్తుకు అనువుగా సీటు సరిచేసుకోవచ్చు. సైకిల్ బరువు పదిహేను కిలోలు మాత్రమే. చక్కగా మడతపెట్టి బస్సు, ట్రైన్లో తీసుకెళ్లవచ్చు. అంతేకాదు, ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అన్నట్టు ట్యూబ్ పంచర్ అవుతుందన్న భయం లేదు. బ్యాటరీ బ్యాగ్ సహా వచ్చే ఈ సైకిల్ ఆన్లైన్ ధర రూ. 3,65,000. నిజమే, ధర ఎక్కువే. కానీ ఫీచర్లూ ఎక్కువే. అయినా సందేహం ఉంటే.. brompton.com చూడవచ్చు. ప్రొఫెషనల్ సైకిల్ యాత్రికులు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. లక్షలు పోసి కొంటారు కూడా.

పొగరాని పొయ్యి
కాస్త చలిగా అనిపిస్తే చాలు, మంట చుట్టూ చేరి సేదతీరుతారు చాలామంది. మంచు ప్రాంతాల్లో అయితే ఏకంగా ఇంట్లోనే మంట గది ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ, సమస్యంతా పొగతోనే. ఆ ఇబ్బంది లేకుండా తయారు చేసిందే సోలో స్టవ్ రేంజర్. ఈ సరికొత్త స్టవ్‌తో పొగలేని మంటను ఆస్వాదించవచ్చు. 360 డిగ్రీల ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో తయారుచేసిన ఈ స్టవ్‌లో కట్టె పుల్లలు వేసి మంట అంటిస్తే చాలు. చక్కగా మండుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. స్టవ్ ఆన్లైన్ ధర రూ.33,900. పూర్తి వివరాలకు eu.solostove.com

మార్చే అవసరం లేకుండా..
స్విమ్మింగ్‌పూల్ ఈత మహా హుషారుగా ఉంటుంది. కానీ తడి బట్టలు మార్చుకోవడమే పెద్ద సమస్య. డ్రైరోబ్ లాంగ్ స్లీవ్ వాటర్ సూట్ ధరిస్తే ఆ ఇబ్బందే ఉండదు. లోపల వెచ్చని ఉన్నితో, బయట నైలాన్‌తో రూపొందించిన ఈ సూట్ వాటర్‌ప్రూఫ్ మాత్రమే కాదు, విండ్ ప్రూఫ్ కూడా. తొమ్మిది పాకెట్స్‌తో వచ్చే ఈ సూట్‌ను తడి శరీరం మీదే ధరించవచ్చు. ఎన్నిసార్లు వాడినా ప్రత్యేకంగా ఆరబెట్టాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ ధర రూ. 16,000. వివరాలకు చూడండి.. dryrobe.com.

సంద్రంతో సంభాషణ
బీచ్‌లో దర్జాగా పడక కుర్చీలో కూర్చుని సముద్రపు హోరును వినటం, కెరటాల సయ్యాటను మజా చేయడం.. నిజంగా ఓ మహావైభోగం. ఆ అనుభూతిని అందించేందుకు డిజైన్ చేసిందే.. బిజినెస్ అండ్ ప్లెజర్ టామీ చెయిర్. అయిదు భిన్నమైన భంగిమల్లో కూర్చునేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. ఉప్పునీళ్ల ప్రభావానికి ఏమాత్రం పాడుకాదు. కుర్చీకి ఉన్న జిప్ పాకెట్లో పర్సు, సెల్‌ఫోన్ లాంటివి భద్రపరుచుకోవచ్చు. మెత్తని ప్యాడింగ్ స్ట్రిప్స్‌తో బ్యాక్‌ప్యాక్‌లా తగిలించుకుని ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లిపోవచ్చు. ఈ కుర్చీ ఆన్ లైన్ ధర రూ.22,900. మరిన్ని వివరాలకు.. businessandpleasureco.com చూడవచ్చు.
Read More :
“పావురాల బెడదతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ స్ప్రే వాడి చూడండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

