Naya Mall | లగేజ్ సూట్కేస్తోనే ఇక స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు
Naya Mall | అందమైన బ్యాగులు | మగువల హస్తభూషణం బ్యాగ్. నచ్చితే చాలు, ఎంత ఖరీదైనా కొనేస్తుందామె. కాబట్టే, మార్కెట్లో రకరకాల బ్యాగులు హల్చల్ చేస్తున్నాయి. అందులోనూ హస్తకళతో కళకళలాడే బ్యాగులదే ఇప్పుడు హవా.
Naya Mall | స్మార్ట్ ప్రయాణానికి..
దూర ప్రయాణాలు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయో, అన్ని ఇబ్బందులనూ కలిగిస్తాయి. ఈ స్మార్ట్ యుగంలో ఫోన్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్ వాచ్.. లేకుండా ప్రయాణం అసాధ్యం. అయితే వాటికి చార్జింగ్ ఎలా అన్నదే అసలైన సమస్య. అలాంటి తలనొప్పి లేకుండా లగేజ్ సూట్కేస్తోనే చార్జింగ్ పెట్టుకునే సౌకర్యంతో వచ్చేసింది.. ‘ఎయిర్వీల్ ఎస్ఆర్5’ సూట్‌కేస్. లైట్ అండ్ స్ట్రాంగ్ మెటల్‌తో తయారుచేసిన ఈ సూట్‌కేస్‌లో మ్యూజిక్ వినేందుకు, ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ యుఎస్బీ పోర్ట్ ఉంటుంది. జీపీఎస్ ట్రాకర్ కూడా ఉండటంతో.. ఈ సూట్‌కేస్‌ను ఎవరూ దొంగిలించలేరు. అంతేకాదు ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే చాలు.. లాక్కెళ్లే పనిలేకుండా మన వెంటే వచ్చేస్తుంది. దీని ఆన్లైన్ ధర రూ.51,000. మీకూ కావాలా? airwheel.netలో బుక్ చేసుకోండి.

అందమైన బ్యాగులు
మగువల హస్తభూషణం బ్యాగ్. నచ్చితే చాలు, ఎంత ఖరీదైనా కొనేస్తుందామె. కాబట్టే, మార్కెట్లో రకరకాల బ్యాగులు హల్చల్ చేస్తున్నాయి. అందులోనూ హస్తకళతో కళకళలాడే బ్యాగులదే ఇప్పుడు హవా. మహిళలకు అత్యవసరమైన మేకప్ సామాన్లు, డబ్బులు, కార్డులు.. వంటివాటిని పెట్టుకునేందుకు వీలుగా చిట్టిచిట్టి బ్యాగులను రూపొందించారు డిజైనర్ లా మెడుస. ఈ మినీ బ్యాగులకు పక్షులు, పూలు, ఆకుల డిజైన్లలో పొదిగిన పూసలు, రాళ్లు మరింత అందాన్ని ఇస్తున్నాయి. సన్నని గొలుసుల్ని జతచేసిన స్లింగ్ బ్యాగులే కాకుండా, అందంగా చేతిలో అమరిపోయే క్లచ్‌లను కూడా తీసుకొచ్చిందీ డిజైనర్. వీటి ప్రారంభ ధర రూ. 2,22,000. వివరాలకు lamedusa.com చూడవచ్చు.

స్వచ్ఛమైన నీటికోసం..
నీటి కాలుష్యం అనేకానేక ఆరోగ్య సమస్యలకు మూలం. అందుకే ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటాం. ఆ అవసరమే లేకుండా ఓ సరికొత్త బాటిల్‌ను రూపొందించింది గ్రేల్ సంస్థ. ఎంత కలుషితమైన నీటినైనా అయిదే అయిదు నిమిషాల్లో స్వచ్ఛమైన ఫిల్టర్ వాటర్‌గా మార్చేస్తుంది. నీటిలోని సూక్ష్మజీవులు, రసాయనాలు, మట్టి, ఇసుక వంటి
వాటిని వడగట్టడమే కాదు.. నీటికి మంచి రుచినీ ఇస్తుంది. ఈ బాటిల్ ఆన్లైన్ ధర రూ. 8,500. పూర్తి వివరాలకు grayl.co.uk చూడవచ్చు. భారతీయ మార్కెట్లోనూ లభిస్తున్నది.

వీణ గణపతి
విఘ్నాలకు అధిపతి గణపతి. అన్ని శుభకార్యాలలో తొలి పూజలందుకునే గణపయ్యను మనం ఎప్పుడూ చేతిలో ఉండ్రాళ్లు, లడ్డూలతోనే చూస్తుంటాం. అందుకు భిన్నంగా..
సరస్వతీదేవి వరంతో వీణా పాణిగా మారిన గణపతి బొమ్మలను చూడముచ్చటగా తయారుచేసింది లాడ్రో సంస్థ. సిరామిక్ హంగులతో ఉన్న ఈ విగ్రహాలు మూడు ప్రత్యేకమైన రంగుల మేళవింపుతో మెరిసిపోతున్నాయి. ఈ వినాయకుడిని పూజా మందిరంలోనే కాదు కారు, కార్యాలయం.. ఎక్కడైనా ప్రతిష్ఠించుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ.1,41,000. మరిన్ని వివరాలకు చూడండి.. lladro.com.
Read More :
Naya Mall | బ్యాటరీ ఎక్కువసేపు రావాలా? అయితే మొబైల్‌కు ఈ కూలర్ వాడండి”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

