ఈ స్మార్ట్ కీ బోర్డు ఉంటే మొబైల్లో కూడా పేజీలకు పేజీలు సులువుగా టైప్ చేయొచ్చు
భలే కీబోర్డు
ప్రస్తుతం ఏ పని అయినా కంప్యూటర్ మీదో, ఫోన్లోనో చేయాల్సిందే. రోజులో ఎక్కువభాగం కీబోర్డుపైనే గడిపేస్తాం. అంతసేపు టపటపా టైప్ చేస్తూపోతే.. వేళ్లకు ఇబ్బంది, చేతులకు నొప్పి. ఆ సమస్య లేకుండా.. మృదువుగా టైప్ చేసేందుకు వీలుగా లిల్క్లిక్స్ సంస్థ ‘ఫింగర్స్’ అనే సరికొత్త కీబోర్డును తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కీబోర్డు పై ఉండే సెన్సర్లు మనం టైప్ చేయబోయే అక్షరాల్ని వేలు పెట్టగానే పసిగట్టేస్తాయి. దాంతో శ్రమ పడకుండానే ఎన్ని పేజీలైనా టైప్ చేసేయవచ్చు. ల్యాప్టాప్కే కాదు ట్యాబ్లెట్, ఫోన్‌తోనూ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సాయంతో ఒకేసారి మూడు పరికరాలకు అనుసంధానం చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాదు ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 45 రోజులు పనిచేస్తుంది. ఈ వైర్లెస్ కీ బోర్డు ఆన్లైన్ ధర రూ.2,500. మరిన్ని వివరాలకు fingers.co.in చూడవచ్చు.

అన్ని భాషలూ అరచేతిలోనే ..
కొత్త ప్రదేశాల్లో పర్యటించాలంటే ముందుగా భయపెట్టేది భాష. తెలియని ప్రాంతంలో తెలియని భాషతో ఇబ్బందిపడలేక ప్రయాణాల్ని మానుకునేవారూ ఉన్నారు. అదే పాకెటాక్స్ చేతిలో ఉంటే, ప్రపంచంలో ఏ మూలకైనా సరే వెళ్లిపోవచ్చు. అరచేతిలో అమరిపోయే ఈ పరికరం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అరబిక్.. తదితర 82 భాషల్ని చదవగలదు, మనకు కావలసిన భాషలోకి అనువదించనూగలదు. సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, కరెన్సీ.. ఏదైనా సరే, దీంతో ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేసి పెడుతుంది. స్వర రూపంలోనూ వినిపిస్తుంది. ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే ఏ దేశమైనా చుట్టిరావచ్చన్నమాట. దీని ఆన్లైన్ ధర రూ.20,900. పూర్తి సమాచారం కోసం pocketalk.com లోకి వెళ్లండి.

వెచ్చని కోటు..
చల్లని వాతావరణంలో ఒంటిని వెచ్చగా హత్తుకుంటుంది స్వెట్టర్. అయితే స్వెట్టర్లంటే ఊలుతో తయారైనవే తెలుసు మనకు. కానీ స్టెల్లా మెకర్టనీ అనే డిజైనర్ సరికొత్తగా కాటన్‌తో తయారు చేసిన స్వెట్టర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి స్వచ్ఛమైన నూలుతో అచ్చంగా చేతితో అల్లినవి! రకరకాల సైజులు, డిజైన్లలో అన్ని వయసుల వారికి సరిపోయే కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రంగురంగుల కాటన్ ఊలుతో.. అల్లికలోనే అందమైన చిత్రాలను సృష్టించడం వీటి ప్రత్యేకత. ఈతరం వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధర సుమారు రూ. 66,300.

కునుకు హాయిగా..
ప్రయాణాల్లో చల్లగా గాలి వీస్తుంటే కళ్లు వాలిపోతుంటాయి. చాలామంది కూర్చునే కునికిపాట్లు పడుతుంటారు. అయితే అలా తూలుతున్నప్పుడు మెడలు పట్టుకునే అవకాశం ఎక్కువ. ఆ ఇబ్బంది లేకుండా హాయిగా కునుకు తీసేందుకు సాయపడుతుంది న్యాప్స్కార్ఫ్. దీంతో కూర్చున్నచోటే మెడ వాలిపోకుండా పడుకోవచ్చు. మెడకు చుట్టుకుంటే చాలు.. దీనిలోని పట్టీలు తలకు దన్నుగా ఉంటాయి. సన్నగా, పొడవుగా, లావుగా, చిన్నగా.. మెడ పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు. మెత్తని ఫ్యాబ్రిక్‌తో తయారుచేయడం వల్ల శరీరంపై ఎలాంటి ఒత్తిడీ కలగదు. దీని ఆన్లైన్ ధర రూ.5,500. పూర్తి వివరాలకు uk.trtltravel.com ను సందర్శించండి.
Read More :
Naya Mall | ఈ షవర్ కింద స్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయంట !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

