ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
TharunBhascker | టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను కీలక పాత్రల్లో నటించారు. మొదటి భాగం సృష్టించిన నవ్వుల సందడిని ఈ సీక్వెల్ కొనసాగించిందా? కథనంలో ఉన్న బలాలు, బలహీనతలు ఏమిటి? పూర్తి రివ్యూలో చూద్దాం.
జాబ్ వదిలేసిన వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), ఉప్పు(వెంకటేష్ కాకుమాను), కౌశిక్ (అభినవ్ గోమటం) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అయితే వీరందరూ కలిసి తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో నలుగురి మధ్య దూరం పెరుగుతుంది. ఆ వైఫల్యంతో వివేక్ బయటి ప్రపంచానికి దూరంగా ఉండిపోతాడు. కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా, కౌశిక్ నటుడిగా, ఉప్పు చిన్న చిత్రాల ఎడిటర్‌గా తమదైన దారిలో ప్రయాణిస్తుంటారు. మరోవైపు మెడిసిన్ చదువుతున్న కీర్తనకు సినిమాపై ఉన్న ఆసక్తితో కార్తీక్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. సినిమాలు, కళాకారులంటే ఏమాత్రం గౌరవం లేని పెద్ద డాక్టర్ రావు.. తన కుమార్తె కీర్తనకు మరో డాక్టర్‌తో పెళ్లి నిశ్చయిస్తాడు. అయితే కీర్తనను ప్రేమిస్తున్న కార్తీక్.. స్నేహితుల సాయంతో ఆ పెళ్లిని ఆపేస్తాడు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ రావు.. పెళ్లి ఖర్చులు తిరిగి చెల్లించాలని, లేదంటే జైలుకు పంపుతానని గ్యాంగ్‌ను హెచ్చరిస్తాడు. ఆ డబ్బును సమకూర్చుకోవడానికి మళ్లీ ఒక్కటైన స్నేహితులు.. సర్వైవల్ థ్రిల్లర్ తీయడానికి థాయ్‌లాండ్ వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన సవాళ్లు ఏమిటి? నలుగురి మధ్య తలెత్తిన గొడవలు, ఈగోలకు కారణమేమిటి? డాక్టర్ రావు పెట్టిన షరతును వారు ఎలా పూర్తి చేశారు? స్నేహితుల విలువను వివేక్ ఎలా అర్థం చేసుకున్నాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
నవ్వులు పంచే చిత్రాలకు థియేటర్లలో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తొలి భాగం తరహాలోనే ఇందులోనూ స్నేహం, సినీ ఆసక్తి, ఆశలు వంటి అంశాలకు హాస్యాన్ని జోడించి తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ముఖ్యంగా నలుగురు స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలు, వారి మధ్య సంభాషణలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. పాత్రల తీరుకు తగ్గట్టుగా రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. ప్రథమార్థం సరదా సన్నివేశాలతో సాఫీగా సాగుతుంది. మధ్యలో కొత్త పాత్రలను తీసుకుంటూ కథలో ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. సినిమా తీయాలనే తపనతో ఆ బృందం చేసే అల్లరి, దాని వల్ల తలెత్తే సమస్యలు వినోదాన్ని పంచుతాయి. ద్వితీయార్థం కూడా అదే నవ్వులతో మొదలవుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించిన భావన కలుగుతుంది. కొన్ని చోట్ల కథనం కొంత తడబడినట్టు అనిపించినా, వెంటనే వచ్చే హాస్య సన్నివేశాలు మళ్లీ ప్రేక్షకులను కథలోకి లాక్కొస్తాయి. దాంతో ఆ కొద్దిపాటి నెమ్మదితనం పెద్దగా భారంగా అనిపించదు. గెస్ట్ రోల్స్‌లో కనిపించిన దర్శకులు, వారి సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. మొత్తంగా మొదటి నుంచి చివరి వరకు నవ్వించేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు.
నటీనటులు
వివేక్‌గా విశ్వక్ సేన్, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉపేంద్రగా వెంకటేశ్ కాకుమాను తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. నలుగురు స్నేహితుల మధ్య ఉన్న సమన్వయం, కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ సహా ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నేపథ్య సంగీతం, పాటలు కథా వాతావరణానికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మరోసారి స్నేహితుల మధ్య సరదా మాటలు, హాస్యంతో వినోదం పంచే ప్రయత్నం చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్.
చివరిగా.. స్నేహం, సినిమా కలలు, నవ్వించే సన్నివేశాల కలయికతో ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రేక్షకులకు ఓ సరదా వినోదాన్ని అందిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల గ్యాంగ్ చేసే సందడి సినిమాకు ప్రధాన ఆకర్షణ.
రేటింగ్: 3.25/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
Bihar | బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

