Naya Mall | ఈ చెప్పులు వేసుకుంటే టెన్షన్స్ అన్ని ఇట్టే మాయమైపోతుంది
Naya Mall |సొగసరి జోళ్లు
నీరసం, బీపీ, భయం తదితర కారణాల వల్ల చాలామంది అరికాళ్లలో చెమటలతో ఇబ్బంది పడుతుంటారు. తగినంత గాలి తగలకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే, అరికాళ్లకు సైతం గాలి తగిలేలా సరికొత్త జోళ్లు వచ్చేశాయి. 3డీ ప్రింట్‌తో రూపొందిన ఈ పాదరక్షలు గళ్లుగళ్లుగా ఉంటాయి. వీటిని ధరించి నడిస్తే పాదాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. ఈ చెప్పులను ఆడ, మగ.. ఎవరైనా ధరించవచ్చు. ఆన్లైన్ ధర రూ.6,350. మరిన్ని వివరాలకు asics.com/us చూడవచ్చు.

క్లాస్‌గా.. గ్లాసులు!
ఇంట్లో ప్రతీది అందంగా ఉండాలని కోరుకుంటాం. వంటింటి సామానైతే మరింత ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడతాం. కాబట్టే ఆధునికతతోపాటు అందాన్ని, సంప్రదాయాన్ని కలబోసి సరికొత్త గ్లాసుల్ని రూపొందించారు ప్రముఖ డిజైనర్ రీతూకుమార్. ప్రత్యేకమైన కశ్మీరీ బూటీ డిజైన్‌తో ప్రాణంపోసిన ఈ గ్లాసులు మామూలు గాజుకంటే పదిరెట్లు మెరిసిపోతాయి. రాగి కలబోసినట్లుండే ప్రత్యేకమైన రంగులో ఇట్టే ఆకర్షిస్తాయి. వీటి ఆన్లైన్ ధర ప్రతి సెట్‌కు రూ.5,200 (నాలుగు గ్లాసులు). మరిన్ని వివరాలకు ritukumar.com చూడవచ్చు.

హ్యాపీ జర్నీ
ప్రయాణాలంటే అందరికీ సరదానే. కానీ లగేజీ మోయాలంటేనే ఇబ్బంది. ఆ బాధ తెలియకుండా వచ్చేసింది సరికొత్త చక్రాల సూట్‌కేస్. సెన్సర్, స్మార్ట్కేస్ సామ్సోనైట్ ప్రొక్సిస్ సూట్‌కేస్ ప్రత్యేకత. దీని మల్టీలేయర్ కవర్ స్టైలిష్ లుక్‌ను ఇవ్వడంతోపాటు లోపల ఉన్న వస్తువులకు ఎలాంటి హానీ జరుగనివ్వదు. గాజు సామగ్రిని కూడా నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. వస్తువులన్నీ కలిసిపోకుండా దీనిలోని రెండు లేయర్లలో విడివిడిగా సర్దుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ.34,900. samsonite అధికారిక వెబ్సైట్లో మరిన్ని ఫీచర్స్ తెలుస్తాయి.

మసాజ్ .. మంత్ర
తరచూ కండరాలు పట్టేస్తుంటాయి చాలామందికి. క్రీడాకారులు, ఉద్యోగుల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. పట్టేసిన చోట కాస్త నూనె, పెయిన్ బామ్ రాసి మసాజ్ చేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. కానీ, మర్దన చేయడానికి మనిషంటూ కావాలి. మరోవ్యక్తి అవసరం లేకుండా ఎవరికి వారే మసాజ్ చేసుకునేలా రూపొందిందే హైపర్వోల్ట్ గో 2. శరీరంలో కాళ్లు, చేతులు, మెడ, భుజాలు.. ఇలా ఎక్కడ కండరాలు పట్టేసినా దీంతో చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది చార్జింగ్‌తో పనిచేస్తుంది. చేత్తో పట్టుకునేందుకు వీలుగానూ ఉంటుంది. దీనిపై ఉండే మూడు ట్రిగర్ పాయింట్స్ మసాజ్ స్పీడ్‌ను నియంత్రిస్తాయి. దీన్ని ఎలా వాడాలో తెలియజేస్తూ ఓ యాప్ రూపొందించారు. ఈ మసాజర్ ఆన్లైన్ ధర రూ.18,999. పూర్తి వివరాలకు hyperice.in చూడవచ్చు.

లెహంగామా..
పూలు ఇష్టపడని మహిళలు ఉండరు. మగువలకోసం రూపొందించే దుస్తుల డిజైనింగ్‌లో.. పూలు, ఆకులు, తీగలకే పెద్ద పీట. ఇంపైన రంగుల కలబోతగా పువ్వుల డిజైన్‌తో అందమైన లెహంగాలు వచ్చేశాయి. ‘మసాబా మసాబా’ బ్రాండ్ డిజైనర్ లెహంగాలను అందమైన పట్టీ, ప్రిల్స్, పాకెట్స్, బటన్స్‌తో రూపొందించారు. వెడల్పయిన బార్డర్‌తో ట్రెడిషనల్ లుక్ తోడైంది. దీనికి కాంట్రాస్ట్‌గా ఇచ్చిన వైట్ షర్ట్ ట్రెండీ లుక్‌లో అదరగొడుతున్నది. దీని ఆన్లైన్ ధర రూ.28,000. ఇంకొంత తెలుసుకోవాలని అనుకుంటే.. Houseofmasaba.com వెబ్సైట్ చూడండి.
Read More :
“ఈ స్మార్ట్ కీ బోర్డు ఉంటే మొబైల్లో కూడా పేజీలకు పేజీలు సులువుగా టైప్ చేయొచ్చు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

