Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !
Naya Mall | ఫోన్లు, వాచీలు, ల్యాప్‌టాప్‌లు, బ్లూటూత్‌లు.. ఎటుచూసినా స్మార్ట్ పరికరాలే. ఏ ఒక్కటి లేకపోయినా పని జరగడం లేదు. కానీ వీటిని వినియోగించాలంటే తరచూ చార్జ్ చేయాల్సిందే. ఫలితంగా, పవర్బ్యాంక్ల వాడకమూ పెరిగిపోయింది.
Naya Mall | చోటా భీమ్..
ఫోన్లు, వాచీలు, ల్యాప్‌టాప్‌లు, బ్లూటూత్‌లు.. ఎటుచూసినా స్మార్ట్ పరికరాలే. ఏ ఒక్కటి లేకపోయినా పని జరగడం లేదు. కానీ వీటిని వినియోగించాలంటే తరచూ చార్జ్ చేయాల్సిందే. ఫలితంగా, పవర్బ్యాంక్ల వాడకమూ పెరిగిపోయింది. ఇప్పుడు నాలుగు పరికరాలనూ ఒకేసారి చార్జ్ చేసేలా మల్టిఫుల్ కనెక్టెడ్ పోర్టులతో వచ్చేసింది వీబీఎస్ఎక్స్10 పవర్‌బ్యాంక్. మూడున్నర గంటల్లో పరిపూర్ణంగా చార్జ్ అవుతుంది. 10000ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ పవర్ బ్యాంక్‌ను చోటా భీమ్ పేరుతో విడుదల చేశారు. వింగజాయ్ సంస్థ తయారీ ఇది. కేవలం 30-45 నిమిషాల వ్యవధిలోనే పరికరాలను పూర్తిగా చార్జ్ చేయగలదు. దీనికి అమర్చిన నాలుగు ఎల్యీడీ లైట్లు బ్యాటరీలోని చార్జింగ్ స్థాయిని సూచిస్తాయి. అధిక వేడి, షార్ట్‌సర్క్యూట్, అధిక చార్జింగ్ వగైరా ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా డిజైన్ చేశారు. దీని ఆన్లైన్ ధర రూ. 2,790. వివరాలకు ఆన్లైన్లో చూడండి.

పెట్ ఫ్రెండ్లీ గ్రూమ్..
కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వాటికి స్నానం చేయించడం, పరిసరాలను శుభ్రం చేయడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఆయా జంతువుల జుట్టు తేలికగా ఉంటుంది. ఇల్లంతా విస్తరిస్తుంది. అనారోగ్యాలకూ కారణం అవుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసింది.. డైసన్ పెట్ ఫ్రెండ్లీ గ్రూమ్ టూల్. దీని సాయంతో జంతువుల చర్మంపై రాలిపోయే జుట్టును తేలికగా తొలగించవచ్చు. దీన్ని వాక్యూమ్ క్లీనర్‌కు జతచేసి వాటిపై మృదువుగా దువ్వితే చాలు.. ఒంటిపై పేరుకుపోయిన దుమ్ము, ఊడిపోయిన వెంట్రుకలన్నీ వచ్చేస్తాయి. జంతువులు పడుకునే చాపలు కూడా శుభ్రం చేయవచ్చు. అయితే వాడేముందు జాగ్రత్తలు చదవడం తప్పనిసరి. ఈ పెట్ ఫ్రెండ్లీ గ్రూమ్ ఆన్లైన్ ధర రూ.9,900. వివరాలకు dyson.com క్లిక్ చేయండి.

చెవులకు ఇంపుగా..
సంగీతం జీవితంలో ఓ భాగమైపోయింది. ఆనందంగా ఉన్నా, బాధగా అనిపించినా.. శ్రావ్యమైన సంగీతం తోడుగా ఉండాల్సిందే. సంగీత ప్రియులను అలరించేందుకు రకరకాల స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తరంకోసం స్మార్ట్ సొబగులద్దుకుని వచ్చేసింది బేయర్ డైనమిక్ బ్లూటూత్ స్పీకర్. ఈ స్పీకర్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని నచ్చిన పాటలు ఆస్వాదించవచ్చు. కారు, ఆఫీస్, డైనింగ్ టేబుల్, లివింగ్‌రూమ్.. ఎక్కడైనా ఇట్టే ఒదిగిపోతుంది. చార్జింగ్ సాయంతో పనిచేసే ఈ స్పీకర్‌కు జతచేసిన స్మార్ట్కేస్ బ్యాటరీ స్థాయిని చూపిస్తుంది. కాల్, మ్యూట్, స్పీకర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్పీకర్ ఆన్లైన్ ధర రూ. 14,499. పూర్తి వివరాలకు beyerdynamic.com చూడవచ్చు.

భలే జోడీ..
అందంగా చేతికి అమరిపోయే చిట్టిపొట్టి బ్యాగులంటే మహిళలు చాలా ముచ్చటపడతారు. సందర్భం ఏదైనా అలంకరణకు తగిన బ్యాగులను ఎంచుకుంటారు. వారికోసం రాజస్థానీ అద్దాల మెరుపుతోపాటు ఎంబ్రాయిడరీ సొగసులద్దిన సరికొత్త సిడ్నీ స్లింగ్ బ్యాగుల్ని తీసుకొచ్చింది ‘ద గార్నిష్ కంపెనీ’. మగువల అభిరుచికి తగినట్టు జంతువులు, మొక్కలు, పువ్వులతో ముచ్చటగా ఉన్నాయి. ప్రకృతి అందాలు పోతపోసినట్టున్న ఈ బ్యాగులను చేతిపర్సుగానూ వాడుకోవచ్చు. ప్రారంభ ధర రూ. 8,000. పూర్తి వివరాలకు Thegarnishco.com చూడవచ్చు.
Read More :
Naya mall | చార్జింగ్‌తో పనిచేసే ఈ బల్బు ద్వారా పాటలు కూడా వినవచ్చు”
“Naya mall | షుగర్ ఉన్నవాళ్లకు ఈ డివైజ్ ఎంత బెటర్ తెలుసా”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

