Naya Mall |ఈ డివైజ్ మీ ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్లినా మొక్కల గురించి టెన్షన్ అక్కర్లేదు
Naya Mall | ఓ రెండు రోజులు ఎటైనా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు చాలామంది. కారణం.. ఇష్టంగా పెంచుకునే మొక్కలు వాడిపోతాయనే భయం. పచ్చదనం పట్ల ప్రేమ. ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు వచ్చేసింది..
Naya Mall | మొక్కలు వాడిపోవిక..
ఓ రెండు రోజులు ఎటైనా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు చాలామంది. కారణం.. ఇష్టంగా పెంచుకునే మొక్కలు వాడిపోతాయనే భయం. పచ్చదనం పట్ల ప్రేమ. ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు వచ్చేసింది.. కార్చర్ వాటర్ టైమర్ డబ్ల్యూటీ5. ఈ టైమర్‌ను నల్లాకు బిగించి వారం రోజులకు సరిపడా టైమింగ్స్ సెట్ చేస్తే చాలు.. ఎంచుకున్న సమయాల ప్రకారం మొక్కలకు నీళ్లు అందుతాయి. రోజూ రెండుసార్లు నీళ్లు పట్టేలా కూడా ప్రోగ్రామ్ చేయవచ్చు. కాబట్టి, మొక్కలు వాడిపోతాయనే భయం అక్కర్లేదు. ఈ వాటర్ టైమర్ ఆన్లైన్ ధర రూ. 4,364. పూర్తి వివరాలకు kaercher.com సందర్శించండి.

ప్రతిక్షణాన్నీ బంధించు!
స్మార్ట్ యుగంలో సెల్ఫోన్లే కెమెరా అవతారం ఎత్తాయి. ఎవరికి వారు ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. ప్రతి సంఘటననూ ఫోన్లలో బంధిస్తున్నారు. అలా కాకుండా కెమెరాలతోనే అద్భుతాలు చేస్తున్నవారు ఎంతోమంది. అలాంటి ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ‘హీరో 11 బ్లాక్’ పేరుతో సరికొత్త కెమెరాను తీసుకొచ్చింది గోప్రో. సుమారు 150 గ్రాముల బరువుండే ఈ చిట్టి కెమెరాను బైక్, కార్.. ఇలా ఎక్కడైనా సెట్ చేసుకుని.. ప్రతి క్షణాన్నీ రికార్డు చేయవచ్చు. 360 డిగ్రీలు గిరగిరా తిరిగే సామర్థ్యం ఉన్న ఈ కెమెరాతో సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా డిస్ప్లే ఆప్షన్ ఉంది. యూఎస్బీ, ఎస్డీ కార్డు పోర్ట్ ద్వారా పెన్‌డ్రైవ్, మెమరీ కార్డులలో వీడియోలు, ఫొటోలను పదిలం చేసుకోవచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కెమెరా వాటర్‌ఫ్రూఫ్ కూడా. ఆన్లైన్ ధర రూ.51,500. పూర్తి వివరాలకు gopro.com చూడవచ్చు.

ఆపిల్ వాచ్ అల్ట్రా..
స్మార్ట్ యుగానికి సరిపోయేలా మరిన్ని ఫీచర్స్‌తో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది ఆపిల్. వాచ్ అల్ట్రా సిరీస్ పేరుతో విడుదలైన ఈ వాచీ ఇప్పటివరకూ ఆపిల్ విడుదల చేసిన అన్ని స్మార్ట్ వాచీలకంటే అతిపెద్ద డిస్ప్లేతో అందరినీ ఆకట్టుకుంటుంది. 49 ఎమ్ఎమ్ టైటానియం కేస్, ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ బెల్ట్‌తో దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో జీపీఎస్ ట్రాకర్, కంపాస్, హెల్త్‌కేర్, బాడీకేర్.. ఇలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 36 గంటలపాటు పనిచేస్తుంది. లో పవర్ యూసేజ్ మోడ్‌లో పెడితే ఏకంగా 60 గంటలు పనిచేయగల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత. అంతేకాదు ప్రమాదాలను గ్రహించి అలర్ట్ చేసే సైరన్ సిస్టమ్ కూడా ఉంది. నీళ్లలోనూ పనిచేసే ఈ వాచీ ఆన్లైన్ ధర రూ. 89,900. నచ్చితే apple.com మీద క్లిక్ చేయండి.

అధరాలంకరణ
అతివల అధరాలకు మరింత అందాన్నిస్తుంది లిప్‌స్టిక్. అయితే లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాల కారణంగా కొంతమంది దీన్ని ఇష్టపడరు. అందుకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెదాల మెరుపు పెంచేలా సహజసిద్ధమైన లిప్‌స్టిక్‌ను తీసుకొచ్చింది ప్రముఖ కాస్మొటిక్స్ తయారీ సంస్థ బాబీ బ్రౌన్. వివిధ రంగులు, సహజసిద్ధమైన నూనెలను ఉపయోగించి ఈ లిప్‌స్టిక్‌లను తయారు చేస్తారు. దీనివల్ల పెదాలకు ఎటువంటి హానీ కలుగదు. ఇందులోని ఔషధీకృత తైలాలు.. పెదాలు పొడిబారకుండా చూస్తాయి. తేమతో మెరిపిస్తాయి. ఈ లిప్‌స్టిక్ ఆన్లైన్ ధర రూ. 3,850. మీకూ కావాలంటే bobbibrown.comలో ఆర్డర్ చేయండి.
Read More :
“Naya Mall | ఈ ఛార్జర్‌తో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడమే కాదు శానిటైజ్ కూడా చేయొచ్చు”
“Naya Mall | లగేజ్ సూట్కేస్తోనే ఇక స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

