శ్రీకాంతాచారి బలిదానానికి కాంగ్రెస్సే కారణం
తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఉద్యమకారులపై నాడు రైఫిల్స్ ఎకుపెట్టిన వారే.. నేడు ఉద్యమ త్యాగాల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు.
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం కమాన్‌బజార్, నవంబర్ 23 : తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఉద్యమకారులపై నాడు రైఫిల్స్ ఎకుపెట్టిన వారే.. నేడు ఉద్యమ త్యాగాల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొసలికన్నీరు మరింత విడ్డూరంగా ఉన్నదని అన్నారు. అప్పట్లో హుజూర్నగర్ ఉప ఎన్నికలో శంకరమ్మపై తెలంగాణ వ్యతిరేక శక్తులు పోటీ చేసి ఆమెను ఓడించాయని గుర్తుచేశారు. సోమవారం ఖమ్మంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘కేసీఆర్ చచ్చుడో -తెలంగాణ వచ్చుడో’ నినాదంతో స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు అంకురార్పణ జరిగిన ఖమ్మం గడ్డపై ఈ నెల 29న ‘దీక్షాదివస్’ నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వరాష్ట్ర కాంక్ష నిలువెల్లా ఉన్న ఖమ్మం ప్రజలు ఇక్కడ కేసీఆర్‌కు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ దీక్షే తెలంగాణ సాధనకు తొలిమెట్టుగా నిలిచిందని, నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసేలా చేసిందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

