Naya mall | చార్జింగ్‌తో పనిచేసే ఈ బల్బు ద్వారా పాటలు కూడా వినవచ్చు
naya mall | పడకగదిలో చాలామంది తమకు ఇష్టమైన వారి ఫొటోలు పెట్టుకుంటారు. ఉదయాన్నే నచ్చినవారి ముఖం చూస్తే.. మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది కూడా. ఇక ఆ ఆత్మీయుల ఫొటో జిలుగు వెలుగులతో దర్శనమిస్తే.. ఆనందమే వేరు. ఆ అవకాశం ఇస్తున్నది పర్సనలైజ్డ్ ఫొటో ల్యాంప్.
Naya mall | కాంతులు వెదజల్లుతూ..
పడకగదిలో చాలామంది తమకు ఇష్టమైన వారి ఫొటోలు పెట్టుకుంటారు. ఉదయాన్నే నచ్చినవారి ముఖం చూస్తే.. మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది కూడా. ఇక ఆ ఆత్మీయుల ఫొటో జిలుగు వెలుగులతో దర్శనమిస్తే.. ఆనందమే వేరు. ఆ అవకాశం ఇస్తున్నది పర్సనలైజ్డ్ ఫొటో ల్యాంప్. బ్లూటూత్ స్పీకర్, స్మార్ట్ డిస్ప్లే జతచేసిన ఈ బల్బులను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే చాలు. ఎంచుకున్నఛాయాచిత్రాలు స్క్రీన్‌పై పలకరిస్తాయి. చార్జింగ్‌తో పనిచేసే ఈ బల్బు ద్వారా పాటలు కూడా వినవచ్చు. ఫొటో బ్యాక్ గ్రౌండ్లో.. నచ్చిన కాంతులను ఎంచుకునే వీలు కూడా ఉంది. ఒక్క టచ్‌తో నియంత్రించే వీలున్న ఈ ఫొటో ల్యాంప్ ఆన్లైన్ ప్రారంభ ధర రూ.1,999.

గుబాళింపుతో..
చక్కని పరిమళం మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇల్లు, ఆఫీస్ అనే తేడా లేకుండా ఎల్లవేళలా సువాసనలు వెదజల్లేందుకు రకరకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగానే.. ప్రకృతి అందించే సహజ పరిమళాలను నింపుకొని వచ్చేశాయి నేచురల్ సెంటెడ్ క్యాండిల్స్. చిట్టిపొట్టి గాజు గ్లాసుల్లాంటి ఈ కొవ్వొత్తులను ఒక్కసారి వెలిగిస్తే చాలు.. వెలుగులతోపాటు సువాసనా నలుదిక్కులకు విస్తరిస్తుంది. వీటి తయారీలో మైనంతోపాటు సుగంధ తైలాలు వాడటంతో ఇంట్లో కీటకాల బెడద కూడా తగ్గుతుంది. సందర్భాన్ని బట్టి ఎంచుకునేందుకు వీలుగా నోస్టాల్జియా, ఆరా వంటి భిన్నమైన సుగంధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాండిల్స్ ఆన్లైన్ ప్రారంభ ధర రూ.650. పూర్తివివరాలకు nappadori.com చూడవచ్చు.

పంచ్ బ్యాగ్ కొత్తగా..
కొందరు బాక్సింగ్ చూడ్డానికి ఇష్టపడతారు. మరికొందరు బాక్సింగ్ చేయడానికి ఇష్టపడతారు. బాక్సింగ్ ప్రాక్టీస్‌కు ప్రధాన ఉపకరణం పంచ్ బ్యాగ్. కానీ, గొలుసుకు వేలాడుతూ.. ఒక్కో పంచ్‌కు ఊయలలా ఊగిపోయే పంచ్బ్యాగ్లనే చూసుంటారు మీరు. అలాకాకుండా.. నేలపై ఒద్దికగా ఒదిగిపోయి.. ఎన్ని పంచ్‌లు, కిక్‌లు కొట్టినా కింద పడిపోకుండా.. బాక్సర్బాబుకు గట్టిపోటీ ఇచ్చే నిఖార్సయిన పంచ్ బ్యాగ్‌ను తీసుకొచ్చింది ఫైట్ క్యాంప్ సంస్థ. ఇష్టమైన బాక్సర్ ఆటను గమనిస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తేలికైన ముడిపదార్థం నింపిన ఈ పంచ్ బ్యాగ్‌తో పిల్లలూ నేర్చుకోవచ్చు. ధర రూ. 41,200.

ఇంట్లోనే వ్యాయామం..
ఫిట్‌నెస్‌కు వ్యాయామమే ఉత్తమ మార్గం. ఉదయాన్నే బయటికెళ్లి వాకింగ్‌లూ, జాగింగ్‌లూ చేయలేని వారికోసం రకరకాల పరికరాలు వచ్చేశాయి. ఓ అడుగు ముందుకేసి.. స్మార్ట్ ఫీచర్స్‌తో సరికొత్త ఎక్సర్సైజ్ బైక్‌ను రూపొందించింది కరోల్ సంస్థ. తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ బైక్‌ను ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దీనికి జతచేసిన స్మార్ట్ స్క్రీన్ సాయంతో జూమ్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా.. దీన్ని ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవడమే. ఫ్లెక్సిబుల్ సీట్ సాయంతో సైకిల్ ఎత్తును, సైక్లింగ్ వేగాన్ని ఎంచుకోవచ్చు. సమయపాలన కోసం అలారం సెట్ చేసుకునే వీలుంది. కాకపోతే తరచూ చార్జింగ్ పెట్టాలి. ఈ స్మార్ట్ బైక్ ఆన్లైన్ ధర రూ. 2,06,000. వివరాలకు carolbike.com చూడవచ్చు.
Read More :
“Naya mall | షుగర్ ఉన్నవాళ్లకు ఈ డివైజ్ ఎంత బెటర్ తెలుసా”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

