Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్
Naya Mall | కళ్లు కళగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. మనకు రోజూ ఎదురయ్యే అలసట, ఒత్తిడి కళ్లనే ముందుగా ప్రభావితం చేస్తాయి. దాంతో కళ్ల కింద చారలు, ముడతలు ఏర్పడుతుంటాయి. దాంతో వయసు పైబడినట్టు కనిపిస్తారు.
Naya Mall | బంగారంలా భద్రంగా..!
కళ్లు కళగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. మనకు రోజూ ఎదురయ్యే అలసట, ఒత్తిడి కళ్లనే ముందుగా ప్రభావితం చేస్తాయి. దాంతో కళ్ల కింద చారలు, ముడతలు ఏర్పడుతుంటాయి. దాంతో వయసు పైబడినట్టు కనిపిస్తారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ‘24కె గోల్డ్ అండర్ ఐ ప్యాచెస్’ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇందులోని హ్యాలురానిక్ యాసిడ్ కళ్లకింది భాగంలోని తేమను పట్టి ఉంచేందుకు సహకరిస్తే.. రోజ్మేరీ, సరస్వతి ఆకు, తేయాకు చర్మం మీద ముడతల్ని తగ్గించి కాంతిమంతంగా చేసేందుకు ఉపకరిస్తాయి. కొలాజెన్, 24 క్యారెట్ల బంగారు చూర్ణం చర్మాన్ని సాగకుండా చేస్తాయి. గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కుని, ఈ ప్యాచ్‌లను కళ్లకింద నెమ్మదిగా అతికించుకోవాలి. అలా 20 నిమిషాలు ఉంచాక, తీసేయాలి. తర్వాత ఆ ప్రాంతంలో నెమ్మదిగా మర్దన చేయాలి. ఇక మీ కళ్లు కూడా బంగారంలా మెరిసిపోతాయన్న మాట!

స్మార్ట్ కెటిల్
అన్ని కాలాల్లోనూ వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అంటారు నిపుణులు. కానీ, నీళ్లను త్వరగా వేడి చేసేందుకు మైక్రోవేవ్‌ను వాడతారు చాలామంది. మైక్రోవేవ్‌లో వేడిచేసిన నీళ్లు సరైన ఉష్ణోగ్రత వద్ద మరగవు. దీంతో లాభాలకంటే, సమస్యలే ఎక్కువ. కాబట్టే, ఇప్పుడు ప్రత్యేకించి నీళ్లను వేడి చేసేందుకు వచ్చేసింది ‘బల్ముడా కెటిల్’. జపనీస్ సంస్థ ‘బల్ముడా’ రూపొందించిన ఈ కెటిల్ కరెంట్‌తో పనిచేస్తుంది. దీనికి అమర్చిన ఎల్యీడీ ఇండికేటర్ సాయంతో నీళ్లు ఏ స్థాయిలో వేడైందీ తెలుసుకోవచ్చు. స్మూత్ ఫినిషింగ్ కారణంగా వంటింటికి అందం ఖాయం. కెటిల్ ఆన్లైన్ ధర రూ.12,450. పూర్తి వివరాలకు balmuda.com చూడవచ్చు.

రత్నాల బ్యాగు!
జడావూ మోడల్లో అన్‌కట్ వజ్రాలతో చేసే పోల్కీ నగల అందమే వేరు. రాజసం ఉట్టిపడే ఈ ఆభరణాలను ఇష్టపడే అతివలు ఎంతోమంది. అందుకే, పోల్కీ నగల స్ఫూర్తితో లవ్టుబ్యాగ్ సంస్థ ‘అమర ఫ్లాప్ఓవర్’ క్లచ్‌ను రూపొందించింది. ఖరీదైన రాళ్లు, కుందన్లు, జపనీస్ బీడ్స్ జోడించి దీన్ని తయారు చేసింది. కొత్త లుక్ తీసుకు వచ్చేందుకు టాజిల్స్ తరహాలో ఈ రాళ్లూ పూసలను వేలాడదీసింది. ఘనమైన వేడుకలకు పర్ఫెక్ట్ లుక్‌ని తీసుకువచ్చే ఈ పర్సు ఖరీదు 13,900 రూపాయలు. నైకా ఫ్యాషన్స్.కామ్ వెబ్సైట్ ద్వారా షాపింగ్ చేయవచ్చు.

రెండూ రెండే!
చెవిపోగులంటే.. రెండూ ఒకేలా ఉండేవే పెట్టుకుంటాం. అయితే గబుక్కున చూసేందుకు ఒకేలా ఉన్నా రెంటినీ కించిత్ తేడాతో విభిన్నంగా, ఫ్యాషనబుల్‌గా తీర్చిదిద్దింది స్మోక్ వేర్ సంస్థ. కారా ఇయర్రింగ్స్ పేరిట తన వెబ్సైట్లో అమ్మకానికి పెట్టిన ఈ చెవిపోగుల్ని చార్మ్ నెక్లెస్‌లోని పలకలుగా చెక్కిన క్రిస్టల్స్, రీసైకిల్డ్ ముత్యాలు, సహజ సిద్ధమైన రాళ్లతో రూపొందించారు. వీటి చివరన రెండు విభిన్న ఆకృతుల్లో వేలాడుతున్న రాళ్లే వీటికి ప్రత్యేక ఆకర్షణ. వీటి ధరను 4000 రూపాయలుగా నిర్ణయించింది తయారీ సంస్థ. మరిన్ని వివరాలకు సంస్థ వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇంకొన్ని డిజైన్లూ చూడొచ్చు.

ఫేస్‌వాష్ షాంపూ!
స్నానం చేయాలంటే సబ్బు, తలంటు పోసుకోవాలంటే షాంపూ, సాయంత్రాలు మొహం కడుక్కోవాలంటే ఫేస్‌వాష్.. ఇలా రకరకాల ఉత్పత్తుల్ని కొంటాం. ఆ అవసరం లేకుండా ఒకే ఉత్పత్తి ఈ అవసరాలన్నిటినీ తీరిస్తే బాగుంటుంది కదూ! ‘ఫై’ సంస్థ తయారుచేసిన ‘త్రీ ఇన్ వన్ రెజువెనేటింగ్ షవర్జెల్…’ అచ్చంగా అలాంటిదే. ద్రవ రూపంలో ఉండే దీన్ని బాడీవాష్గా, ఫేస్‌వాష్‌గా, షాంపూగా వినియోగించుకోవచ్చు. కాఫీ గింజల సారంతో దీన్ని రూపొందించారు. అన్ని రకాల చర్మాలకూ సరిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ధర 300 మిల్లీలీటర్లకు 500 రూపాయలు. thephylife.com అనే వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
Read More :
“Naya Mall |ఈ చిన్న గ్యాడ్జెట్‌తో మీ చెవిని స్కాన్ చేసేయండి”
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

