Naya Mall |ఈ చిన్న గ్యాడ్జెట్‌తో మీ చెవిని స్కాన్ చేసేయండి
Naya Mall | ఒక్కోసారి చెవుల్లోకి చీమలూ, కీటకాల్లాంటివి దూరుతుంటాయి. కానీ లోపల పరిస్థితి ఏమిటో అర్థం కాదు. అలాంటప్పుడు చెవిలోపల స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడుతుంది పాట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఎక్స్‌లైఫ్.
Naya Mall | చెవిని స్కాన్ చేసేయండి!
ఒక్కోసారి చెవుల్లోకి చీమలూ, కీటకాల్లాంటివి దూరుతుంటాయి. కానీ లోపల పరిస్థితి ఏమిటో అర్థం కాదు. అలాంటప్పుడు చెవిలోపల స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడుతుంది పాట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఎక్స్‌లైఫ్. చెవిలోపలికి వెళ్లగలిగేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరానికి ఆరు ఎల్యీడీ లైట్లు ఉంటాయి. వీటి సాయంతో దీనిలోని కెమెరా చెవిలోపల 360 డిగ్రీల చిత్రాన్ని తీస్తుంది. ఈ డివైజ్ ఫోన్‌కు కూడా కనెక్ట్ అవుతుంది కనుక మనం ఆ ఫొటోలను నిశితంగా చూడొచ్చు. చెవిలో ఉండే గుబిలిని తీసేందుకు ప్రత్యేకంగా ఒక సిలికాన్ నిర్మాణం ఉంటుంది. పాట్రానిక్స్ సంస్థ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1299 రూపాయలకు ఇది దొరుకుతుంది.
నీరు.. మీరు!
శరీరంలో తగినంత నీరు లేకపోవడం ఓ ప్రమాద సంకేతం. ఈ పరిస్థితి అనేక సమస్యలకు దారితీస్తుంది. చాలాసార్లు పని ఒత్తిడిలో నీళ్లు తాగడం మర్చిపోతుంటాం కూడా.ఆ ఇబ్బంది లేకుండా.. మనలాంటి వారికోసమే వచ్చేసింది ‘ఫిల్ అప్’ వాటర్ బాటిల్. ‘ఫ్లూయిడ్ స్టాన్స్’ సంస్థ రూపొందించిన ఈ బాటిల్లో నీళ్లు ఎన్ని గంటలైనా చల్లగానే ఉంటాయి. అంతేకాదు, నిర్దేశించిన సమయాల్లో నీళ్లు తాగమని హెచ్చరిస్తుందీ బాటిల్. కప్పుతో వచ్చే ఈ బాటిల్‌ను వెంట తీసుకెళ్లవచ్చు. ఆ రోజుకు సరిపడా నీటిని ఒక్కసారి నింపితే చాలు.. సాయంత్రానికల్లా పనిగట్టుకుని ఖాళీ చేయిస్తుంది. రకరకాల సైజుల్లో లభించే ఈ బాటిల్ ప్రారంభ ధర రూ. 9,800. fluidstance.comలో మరిన్ని వివరాలు లభిస్తాయి.
ఇట్టే దొరికేలా..
మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం. ఎక్కడికెళ్లినా ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఇయర్‌పాడ్స్, స్మార్ట్ వాచీ.. ఇలా రకరకాల గ్యాడ్జెట్స్ వెంట తీసుకెళ్లక తప్పదు. వాటితోపాటు పవర్‌బ్యాంక్, చార్జర్లు లేకపోతే అస్సలు పనులు జరగవు. వీటన్నిటినీ లగేజీ బ్యాగులో వేసుకుని వెళ్లినా సమయానికి దొరకవు. ఇలాంటి చిన్నచిన్న వస్తువులను పెట్టుకునేందుకు వీలుగా వచ్చేసింది.. ‘పీక్ డిజైన్ టెక్ పౌచ్’. దీనిలోని అరల్లో దేనికదే విడివిడిగా సర్దుకోవచ్చు. అవసరమైనప్పుడు వెతికే పనిలేకుండా వాడుకోవచ్చు. ఈ టెక్ పౌచ్ ఆన్లైన్ ధర రూ. 4,899. మీరూ కొనుక్కోవాలనుకుంటే.. peakdesign.com క్లిక్ చేయండి.
మరింత స్పష్టంగా..
క్లిక్ అనిపిస్తే చాలు.. సంఘటన జ్ఞాపకంగా మారుతుంది. పదిలంగా భద్రపరుచుకోవచ్చు. మళ్లీమళ్లీ చూసుకోవచ్చు. కాబట్టే, చాలామంది కెమెరాను ఇష్టపడతారు. దీంతో తయారీదారులు రకరకాల ఫీచర్స్‌తో సరికొత్త కెమెరాలు విడుదల చేస్తున్నారు. ఫొటోలో ఇంకొంత స్పష్టత కోసం, మరింత క్వాలిటీ లెన్స్‌తో వచ్చేసింది ‘డీజేఐ ఆస్మో పాకెట్ కెమెరా’. అచ్చంగా రిమోట్‌లా కనిపించే ఈ కెమెరా 360 డిగ్రీల కోణంతో దృశ్యాలను రికార్డు చేయగలదు. యూఎస్బీ పోర్ట్ సాయంతో పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డు జతచేసుకుని ఫైల్స్ నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని దూరంలో ఉన్న వస్తువులను సైతం ఈ 4K కెపాసిటీ కెమెరాతో స్పష్టంగా చూడవచ్చు. చేతిలో అమరిపోయే ఈ చిట్టి కెమెరా ఆన్లైన్ ధర రూ. 25,500. పూర్తి వివరాలకు dji.com వెబ్సైట్ చూడవచ్చు.
Read More :
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

