Naya Mall | ఈ డివైజ్‌ను కారులో పెట్టుకుంటే చెడు వాసనలు తొలగించి తాజా గాలి ఇస్తుంది
Naya Mall | కారు గాలి తాజాగా! రోడ్డెక్కామంటేనే కాలుష్యంలో కాలుపెట్టినట్టే. వాహనంలో వెళ్లినా విషతుల్యాలు మన చుట్టూ చేరుతూనే ఉంటాయి. అందుకే కారులోని గాలిని శుభ్రం చేసేందుకు పానాసోనిక్ సంస్థ ‘నానో ఎక్స్ కార్ ప్యూరిఫయర్'ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Naya Mall | కారు గాలి తాజాగా!
రోడ్డెక్కామంటేనే కాలుష్యంలో కాలుపెట్టినట్టే. వాహనంలో వెళ్లినా విషతుల్యాలు మన చుట్టూ చేరుతూనే ఉంటాయి. అందుకే కారులోని గాలిని శుభ్రం చేసేందుకు పానాసోనిక్ సంస్థ ‘నానో ఎక్స్ కార్ ప్యూరిఫయర్’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కారులోని కప్హోల్డర్లో సరిపోయేలా దీన్ని రూపొందించారు. యూఎస్బీకి కనెక్ట్ చేసిన రెండు గంటల్లో కారులోని గాలిని తాజాగా మారుస్తుంది. చెడు వాసనలను తొలగిస్తుంది. శబ్దం ఎక్కువగా రాకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. త్వరలోనే, panasonic.com వెబ్సైట్లో విక్రయాలు ప్రారంభం అవుతాయి. ధర రూ. 11,500.

కాంతితో వండేస్తుంది
మైక్రోవేవ్ ఓవెన్లలో కొత్త ట్రెండును సృష్టించింది బ్రావా సంస్థ. కాంతితో ఆహారాన్ని వండటం దీని విశిష్టత. ప్రత్యేకమైన కాంతి సాయంతో ఎయిర్ ఫ్రై, రోస్ట్, అన్నం, టోస్ట్ తదితరాలను సిద్ధం చేయగలదు. కూరగాయలు మాంసంలాంటివీ ఉడికించగలదు. ఒకేసారి వివిధ ఉష్ణోగ్రతలు సెట్ చేసుకుని, ఏకకాలంలో వేరువేరు పదార్థాలనూ వండేయగలదు. ఈ ఓవెన్లో విభిన్న కుకింగ్ జోన్లు ఉంటాయి. లోపల వంటకం పరిస్థితి ఏంటి అన్నది చూసేందుకు వీలుగా బయటి వైపు గ్లాస్ ఉంటుంది. ఓవెన్ లోపల కూడా వేడిని తట్టుకునే కెమెరాలు ఉంచారు. మరిన్ని వివరాలకు brava.com చూడవచ్చు. ధర రూ. 1.63 లక్షలు.

బెల్ట్‌తో ఆరోగ్యం
కుక్కపిల్లలను తెచ్చుకోగానే మనం ముందు చేసేపని.. దాని మెడలో బెల్టు కట్టడం. ‘ఇనాక్సియా స్మార్ట్కాలర్’ పేరిట తయారవుతున్న కొత్తరకం బెల్టులు.. టామీలు తప్పిపోకుండా చూడటంతోపాటు, వాటి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాయి. గుండెకొట్టుకునే వేగం, శ్వాసరేటు, నిద్ర, నడక తదితర సమాచారాన్ని ఫోన్ ద్వారా చేరవేస్తాయి. అంతేకాదు, నిర్ణీత పరిసరాలను దాటి ఎక్కడికైనా వెళితే వెంటనే ఫోన్ ద్వారా మనల్ని అలర్ట్ చేస్తాయి. అది వెళ్లిన దారినీ చూపిస్తాయి. మొత్తానికి ఈ బెల్టు ఉంటే మన పప్పీ భద్రం అన్నమాట. smartdogcollar.com వెబ్సైట్ ద్వారా స్మార్ట్కాలర్ బుక్ చేసుకోవచ్చు. ధర రూ. 12,300.

స్మార్ట్ చెత్తబుట్ట
వంటింట్లో మిగిలిపోయే వ్యర్థాలను ముందు చెత్తబుట్టలో వేసి, తర్వాత బయటపడేస్తాం. ఆహార వ్యర్థాలు కుళ్లిపోతే ఇట్టే దుర్వాసన వస్తుంది. మాటిమాటికీ చెత్తబుట్ట మార్చాల్సి ఉంటుంది. ‘మిల్ కిచెన్ బిన్’ ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం. ఇందులో పాల పదార్థాలు, మాంసపు వ్యర్థాలతోపాటు గుడ్డు పెంకులు, కూరగాయల తొక్కల్లాంటివీ వేయవచ్చు. స్మార్ట్ టెక్నాలజీతో పనిచేసే ఈ చెత్తబుట్టను ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. దానంతట అదే చెత్తను ఆరబెట్టి రాత్రిపూట గ్రైండ్ చేస్తుంది. ఆ పదార్థాన్ని కోళ్లకు దాణాగా వేసుకోవచ్చు. mill.comలో దీన్ని ఆర్డరు చేసుకోవచ్చు. ధర రూ.33 వేలు మాత్రమే.
Read More :
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

