Naya Mall | ఈ పవర్ బ్యాంక్ ల్యాప్‌టాప్‌ల కోసమే ప్రత్యేకం !
Naya Mall | బయటికి వెళ్లినప్పుడు, కరెంట్ లేనప్పుడు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు పవర్ బ్యాంక్ వాడుతుంటాం. అయితే ఇప్పుడు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు కూడా ఛార్జింగ్ పెట్టుకోగలిగేలా ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తెచ్చింది స్టఫ్‌కూల్ సంస్థ. ‘సూపర్ పవర్' పేరిట వస్తున్న ఈ పవర్ బ్యాంక్‌లో 20000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
Naya Mall | ల్యాప్‌టాప్ పవర్‌బ్యాంక్
బయటికి వెళ్లినప్పుడు, కరెంట్ లేనప్పుడు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు పవర్ బ్యాంక్ వాడుతుంటాం. అయితే ఇప్పుడు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు కూడా ఛార్జింగ్ పెట్టుకోగలిగేలా ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తెచ్చింది స్టఫ్‌కూల్ సంస్థ. ‘సూపర్ పవర్’ పేరిట వస్తున్న ఈ పవర్ బ్యాంక్‌లో 20000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక ఫోన్‌కు ఛార్జింగ్ కావాలంటే 4000 నుంచి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సరిపోతుంది. అంటే, దీంతో మ్యాక్బుక్లాంటి చిన్న ల్యాపీలకూ పవర్ ఇవ్వచ్చు. సి, ఎ టైప్ పిన్లు రెండూ పనిచేస్తాయి. 85 వాట్ల పవర్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఒకపక్క ల్యాపీకి ఫుల్ స్పీడ్ ఛార్జింగ్ అందిస్తూనే ఫోన్లూ, ఇతర పరికరాలకూ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ధర రూ. 4990. వివరాలకు stuffcool.com.

పర్ఫెక్ట్ టీ!
వేడినీళ్లు కావాలన్నా, వేడివేడి కాఫీ టీలు తాగాలన్నా కెటిల్ వైపే చూస్తాం. ఇండక్షన్‌తో పనిచేసే కెటిల్.. స్టవ్ కంటే వేగంగా నీటిని వేడిచేస్తుంది. అయితే పర్ఫెక్ట్ కాఫీ, టీలను తయారు చేయడం కోసమే డ్యుయలిట్ సంస్థ ‘పోర్ ఓవర్’ కెటిల్‌ను తయారుచేసింది. ఇందులో టెంపరేచర్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. అంటే 38 డిగ్రీ సెల్సియస్ మొదలు 100 డిగ్రీల దాకా డిస్ప్లే స్క్రీన్ ఆధారంగా వేడి పెట్టుకోవచ్చు. అవసరమైన ఉష్ణోగ్రత వద్ద పానీయాలను తయారు చేసుకోవచ్చు. మామూలు కెటిళ్లతో పోలిస్తే పనిచేసేప్పుడు ఇది తక్కువ శబ్దం చేస్తుంది. dualit.com వెబ్సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 9000.

పిజ్జాలకు ప్రత్యేకం
కూరల నుంచి పఫ్‌ల దాకా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసేందుకు మైక్రోవేవ్ ఓవెన్లను వాడుతుంటాం. అయితే ఊని సంస్థ ‘ఓల్ట్ 12’ పేరిట సరికొత్త ఓవెన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకించి పిజ్జాలను చేసేందుకు దీన్ని రూపొందించారు. లోపలి పదార్థాన్ని చూడగలిగేలా గ్లాస్ డోర్‌తో తయారుచేశారు. పిజ్జా రకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కావలసినంత ఉష్ణోగ్రత సెట్ చేసుకోవచ్చు. చాలా వేగంగా వంటకాలను తయారుచేస్తుంది. 13 అంగుళాల కుకింగ్ ఏరియా సరిపోతుంది. చిన్నదే కాబట్టి వంటగది గట్టు మీద చక్కగా అమరిపోతుంది. మరిన్ని వివరాలకు ooni.com చూడవచ్చు. ధర రూ. 82 వేలు.

పాటలు వింటూ ఛార్జింగ్…
ఖుషీఖుషీగా సాగుతూ… చలాకి పాటలు వినడం చాలా మందికి అలవాటు. కారులో సంగీత ఆస్వాదనను మరింత సౌకర్యవంతం చేస్తుంది ‘పోర్ట్రానిక్స్ ఆటో వన్’ పరికరం. బ్లూటూత్‌తో దీన్ని ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. యూఎస్బీ, ఎస్డీకార్డ్ల ద్వారానూ ఉపయోగించుకోవచ్చు. ఎఫ్ఎం కూడా వినొచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లాంటి వాటితోనూ పనిచేస్తుంది. అంతేకాదు, ఫోన్ ఛార్జింగ్‌కూ సాయపడుతుంది. బోలెడు ఫీచర్లున్న దీని ధర రూ.1599. portronics.com వెబ్సైట్ ద్వారా ఖరీదు చేయవచ్చు.
Read More :
“Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!”
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

