Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!
Naya Mall | కాలర్ నెక్లెస్‌లు ఎప్పుడూ ఫ్యాషన్ స్టేట్మెంట్లే. అందుకే తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు తయారుచేసి వినియోగదారుల మెప్పుపొందే ప్రయత్నం చేస్తుంటాయి. ఆకట్టుకునేలా ఉన్న ఈ తరహా నెక్లెస్‌ను ఇటీవల ఫారెస్ట్ ఆఫ్ చింజ్ అనే ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ రూపొందించింది.
Naya Mall | ఖరీదైన ఫెరారీ పెన్ను!
పెన్నంటే పదో పాతికో ఉంటుంది. మరీ మంచి పెన్ను అయితే వందలూ వేలూ ఖరీదు చేయవచ్చు. కానీ ఈ మధ్య ఏకంగా 22.74 లక్షల రూపాయల పెన్ను మార్కెట్లోకి వచ్చింది. కార్ల తయారీ సంస్థ ఫెరారి, ప్రముఖ పెన్నుల కంపెనీ మాంట్బ్లాంక్ సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. ‘ద మాంట్బ్లాంక్ ఫెరారీ ైస్టెలెమా ఎస్పీ3’ పేరిట లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చాయి. డేటోన ఎస్పీ3 కారు స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. ఈ కలం మూతను టైటానియంతో చేస్తే, ములుకును తెల్ల బంగారంతో రూపొందించారు. ఇందులో ఇంకు
నింపేందుకూ ప్రత్యేక ఏర్పాటు ఉంది. రక్షణగా పెన్ను మధ్యలో అమర్చే రెడ్బ్లేడ్ ఫెరారీ కార్లను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 599 పెన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని montblanc.com వెబ్సైట్లో అమ్ముతున్నారు.

చమ్కీల దండ
కాలర్ నెక్లెస్‌లు ఎప్పుడూ ఫ్యాషన్ స్టేట్మెంట్లే. అందుకే తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు తయారుచేసి వినియోగదారుల మెప్పుపొందే ప్రయత్నం చేస్తుంటాయి. ఆకట్టుకునేలా ఉన్న ఈ తరహా నెక్లెస్‌ను ఇటీవల ఫారెస్ట్ ఆఫ్ చింజ్ అనే ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ రూపొందించింది. రంగురంగుల సెక్విన్లను జాగ్రత్తగా మధ్యకు మడిచి, ఆకుపచ్చ రంగు సిల్కు వస్త్రం మీద వాటన్నిటినీ అందంగా కుట్టి తయారుచేశారు. మోడ్రన్ దుస్తులకూ నప్పేలా.. జపనీస్ ప్లమ్ కాలర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ నెక్లెస్ ధర రూ. 14,950. shop.forestofchintz.com వెబ్సైట్లో అమ్మకానికి పెట్టిన ఈ మాడల్ ఇతర ఫ్యాషన్ స్టోర్లలోనూ దొరుకుతున్నది.

రేడియో.20
చూడగానే పాతకాలపు ఇండ్లలోని రేడియోలా కనిపిస్తుంది ‘నాయిజీబాక్స్ రెట్రో డబుల్ ఎక్స్ఎల్’ పేరిట సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ పరికరం. దగ్గరి స్టేషన్లను వినిపించే ఎఫ్ఎం మోడ్‌తో పాటు, ఖండాంతరాల్లోని సిగ్నళ్లను రిసీవ్ చేసుకునే ఎస్డబ్ల్యూ రిసీవర్లూ ఇందులో ఉంటాయి. చక్కటి క్లారిటీతో పాటలు, మాటలు వినిపించగలదు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్, ఐపాడ్ లాంటి వాటితో బ్లూటూత్ ద్వారా అనుసంధానించుకోవచ్చు. నచ్చిన పాటను వినొచ్చు. అంతేకాదు, ఇందులో ఎస్డీ కార్డు ఆప్షన్ కూడా ఉంది. ఆ కార్డులోని పాటలనూ మనం ప్లే చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రెట్రో రేడియో.. పురానాపూల్ మే నయామాల్ అన్నమాట! నోస్టాల్జియాను ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు, noizzybox.comలో దొరుకుతుంది. ధర రూ.3,999.

గేమర్లకు ప్రత్యేకం
స్మార్ట్‌యుగంలో గేమింగ్ పరిశ్రమ దూసుకుపోతున్నది. ఇంతకుముందు ఆటలంటే చిన్న పిల్లలకే. కానీ వర్చువల్ రియాలిటీలూ, ప్లే స్టేషన్లూ వచ్చాక ఆ అనుభూతి పెద్దలకూ సొంతమైంది. ఇక, కొంతమంది దీన్ని కెరీర్‌గానూ మలుచుకుంటున్నారు. వాళ్లంతా పెద్దపెద్ద కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని, చెవుల్లో హెడ్సెట్లు పెట్టుకొని ఆడాల్సి వస్తుంది. అలాంటప్పుడు చెవులకు ఇబ్బంది కలగకుండా తయారవుతున్నవే.. ‘ఓక్లీ ఎన్ఎక్స్ టీఎల్వీఎల్’ కళ్లద్దాలు. దీని ప్రత్యేక నిర్మాణం, తయారీకి వాడే పదార్థాల వల్ల హెడ్సెట్ పెట్టుకున్నా సరే చెవులకు అసౌకర్యంగా ఉండదు. తెర నుంచి వచ్చే నీలి రంగు కాంతి కారణంగా కళ్లకు హాని జరగకుండా బ్లూరెడీ లెన్సులతో రూపొందుతున్నాయి. వీటి ధర రూ. 17వేలు. oakley.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

