Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది
Naya Mall | ‘పాటలే చెవులలో తేనె వర్షం..’ అన్నాడో సినీకవి. ఎంత తేనెపాతం అయితే మాత్రం.. చెవి కండరాలు నొప్పి పుట్టేలా ఇయర్ ఫోన్ బడ్స్‌ను లోపలికి చొప్పించుకొని ఇబ్బందిపడాలా? ఈ సమస్యకు మంగళం పాడుతూ రూపొందించినవే హకీ మిక్స్ హెడ్‌బ్యాండ్ హెడ్‌ఫోన్స్. క్రీడాకారులు, మార్నింగ్ జాగర్స్ కోసం వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు
Naya Mall | ఔరా.. ఆరా రింగ్!
మనసైన వారికి ఇచ్చే అందమైన బహుమతుల్లో ప్రధానమైనది ఉంగరం. వజ్రం పొదిగిన బంగారు ఉంగరం, లవ్ సింబల్ ఉన్న ప్లాటినం రింగ్.. ఇలా వెలకట్టలేని ప్రేమను చాటడానికి తాహతుకు మించి తాపత్రయపడుతుంటారు. ఈ ఉంగరాలు తీపి జ్ఞాపకాలను మాత్రమే గుర్తుచేస్తాయి. అదే మీకు నచ్చిన వ్యక్తికి ఆరా జెన్3 టైటానియమ్ స్మార్ట్ రింగ్ కానుకగా సమర్పించి చూడండి! అది వారికి ఆనందాన్ని పంచడంతోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది. సాంకేతికతను పొదుగుకున్న ఈ స్మార్ట్ రింగ్ హార్ట్ రేట్‌ను తెలుపుతుంది. శరీర ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఏ రోజు ఎన్ని అడుగులు వేశామో లెక్కగట్టి చూపుతుంది. ఎంత హాయిగా కునుకు పట్టిందీ చెప్పేస్తుంది. ఇన్ని చెప్పే స్మార్ట్ రింగ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగైదు రోజులు పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. వేలు పట్టుకొని మెరుగైన ఆరోగ్యం సాధించే దిశగా అడుగులు వేయిస్తుందన్నమాట. సిల్వర్, గోల్డ్, బ్లాక్, రోజ్ గోల్డ్ రంగుల్లో లభించే.. ఈ స్మార్ట్ రింగ్ ధర సుమారు రూ.25,000.

మైండ్ బ్లోయింగ్.. యుబ్లో!
స్విస్ వాచీలంటేనే ప్రత్యేకం! అందులోనూ మరిన్ని సొబగులు ఇముడ్చుకొని వస్తున్నాయంటే ఎదురుచూపులు అన్నీ ఇన్నీ ఉండవు. అందుకు తగ్గట్టుగానే, పసిడి డయల్‌తో క్లాసిక్ ఫ్యూజ్ ఒరిజినల్ మాడల్‌ను విపణిలోకి విడుదల చేసింది ప్రముఖ గడియారాల తయారీ సంస్థ యుబ్లో. దాంతోపాటు టైటానియం మెరుపులు, సెరామిక్ సొగసులు కలిగిన వాచీలనూ రూపొందించింది. రత్నాలు పొదిగిన డయల్ చూడగానే కాలం ఒక క్షణం ఆగిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. 33, 38, 48 మిల్లీమీటర్ల వ్యాసంతో మూడు సైజులలో వీటిని అందుబాటులోకి తెచ్చింది. దశాబ్దాల పూర్వం క్లాసిక్ ఫ్యూజ్ వాచీలను రూపొందించిన యుబ్లో సంస్థ తాజాగా అదే మాడల్‌కు కొత్త నగిషీలు అద్ది మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర అచ్చంగా రూ.5,60,000 మాత్రమే!

తలకు బ్యాండు.. వీనులకు విందు
‘పాటలే చెవులలో తేనె వర్షం..’ అన్నాడో సినీకవి. ఎంత తేనెపాతం అయితే మాత్రం.. చెవి కండరాలు నొప్పి పుట్టేలా ఇయర్ ఫోన్ బడ్స్‌ను లోపలికి చొప్పించుకొని ఇబ్బందిపడాలా? ఈ సమస్యకు మంగళం పాడుతూ రూపొందించినవే హకీ మిక్స్ హెడ్‌బ్యాండ్ హెడ్‌ఫోన్స్. క్రీడాకారులు, మార్నింగ్ జాగర్స్ కోసం వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటిని తలకు బ్యాండ్‌గా ధరిస్తే చాలు.. వినసొంపైన సంగీతం కర్ణభేరికి చేరిపోతుంది. ఇవి ధరించడం ద్వారా చెవికి ఇయర్‌బడ్స్ బెడద తప్పించినట్టు అవుతుంది. చెవి కండరాలు నొప్పితో రాగాలు తీయవు ఇక! వీటిలో పవర్ఫుల్ బాస్ కలిగిన స్పీకర్లు ఉండటంతో చెవికి అంగుళం దూరంలో ఉన్నా.. కర్ణభేరికి శ్రావ్యమైన శబ్దాన్ని చేరుస్తాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటలు నిరాటంకంగా పాటలు వినొచ్చు. మీరు అథ్లెట్ అయితే హెడ్‌బ్యాండ్ హెడ్‌ఫోన్స్ ధరించి.. పాటల పల్లకీలో ఊరేగుతూ రెండు మారథాన్లు విజయవంతంగా పూర్తిచేయొచ్చు!

ఈ-పరుగు ఆగదు
ఇటీవల కాలంలో కొత్తకొత్త ఈ-స్కూటర్లు రోడ్డెక్కుతున్నా పూర్తిస్థాయిలో పరుగులు తీయలేకపోతున్నాయి. అందుకే తయారీదారులు ఎప్పటికప్పుడూ నయా ఫీచర్స్ జతచేస్తూ ఎలక్ట్రిక్ వాహనాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రస్థానంలో ‘బో మొబిలిటీ’ సంస్థ ముందడుగు వేసింది. తక్కువ దూరాలు ప్రయాణించడానికి మన్నికైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సూపర్‌హీరోలు దూసుకుపోయే వాహనాల తరహాలో దీనిని కొత్తగా డిజైన్ చేశారు. చూడటానికి నాజూగ్గా ఉన్న ఈ-స్కూటర్‌ను ఫార్ములా 1 రేస్కార్ల ఇంజినీరింగ్ విధానంలో తయారుచేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకూ చిట్టి స్కూటర్ పరుగు ఆగదు. చిన్నచిన్న అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సేఫ్స్టీర్ టెక్నాలజీని ఉపయోగించడంతో.. చోదకులు కంఫర్ట్‌గా రైడ్ చేయొచ్చు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్ల మధ్యలోంచి రెప్పపాటులో దూసుకుపోవచ్చు. ఈ జూన్‌లో అమెరికాలో అందుబాటులోకి రానున్న ‘బో ఎమ్’ ఈ-స్కూటర్.. 2023 చివరికిమనదేశంలోనూ పరుగులు తీయవచ్చు. దీని ధర రూ.1,99,500.
Read More :
“Naya Mall | ఈ పవర్ బ్యాంక్ ల్యాప్‌టాప్‌ల కోసమే ప్రత్యేకం !”
“Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!”
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

