ఇన్నాళ్లూ హెడ్‌బ్యాండ్స్ స్టైల్ కోసం పెట్టుకునేవారు. ఇప్పుడు వాటి రూటు మారింది. రూపం అదే అయినా హెడ్ఫోన్లుగానూ పనిచేస్తున్నాయి. అందులోనూ ‘హకీ మిక్స్ హెడ్ఫోన్ల’ను క్రీడాకారుల కోసం తయారు చేశారు. సాధారణ బ్యాండ్లానే తలకు పెట్టుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తోనూ పనిచేస్తాయి. షటిల్, క్రికెట్…ఇలా ఏ ఆట ఆడుతున్నా గబుక్కున ఫోన్ వస్తే బ్లూటూత్‌తో మాట్లాడొచ్చు. పాటలూ పెట్టుకోవచ్చు. hakii.com వెబ్సైట్లో ఇవి లభిస్తాయి. ధర మాత్రం రూ. 14,400.
Speakers
పోర్టబుల్ స్పీకర్లు… పాట వినాలనే ఆశ ఉండాలేగానీ ఎక్కడికైనా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తాయి. బ్యాగులో వేసుకుని బయల్దేరవచ్చు. అందుకే యువతకు హాట్ ఫేవరెట్లుగా మారాయి. ఇటీవల యు అండ్ ఐ సంస్థ ‘పీటర్ బీటీ స్పీకర్’ పేరిట సరికొత్త పోర్టబుల్ స్పీకర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఒకసారి చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తుందీ స్పీకర్. పసుపుపచ్చ, ఆకుపచ్చ రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్‌లో రూపొందాయి. స్పీకర్ పైభాగాన్ని సెల్‌ఫోన్ పెట్టుకునేందుకు వీలుగానూ రూపొందించారు. మొబైల్ స్టాండ్‌గా కూడా పనికొస్తుంది. ఈ స్పీకర్ మీద ఫోన్ పెట్టుకుని సినిమానో, సిరీసో చూసేయొచ్చు. uandiworld. com ద్వారా ఆన్లైన్లో కొనొచ్చు. వెల రూ.1,199.
Lamp
సాధారణ బెడ్‌ల్యాంప్‌లు మనం చదువుకునేందుకు వీలుగా కాంతిని ప్రసారం చేస్తాయి. ‘లిలీ ఫర్ లైఫ్’ ల్యాంప్ దీనికి భిన్నం. డిస్లెక్సియా వ్యాధితో బాధపడేవారు సులభంగా చదువుకో గలిగేలా దీన్ని తయారుచేశారు. ఇందులోని బల్బు కళ్లు గుర్తించలేని రీతిలో రకరకాల కాంతుల్లో వెలుతురును ప్రసరింపజేస్తుంది. డిస్లెక్సియా వ్యక్తుల కళ్లకు ఈ తరహా ఫ్లాష్‌లు హాయిని కలిగిస్తూ, అక్షరాలు చదవడాన్ని సులభతరం చేస్తాయి. వివరాలకు liliforlife.com చూడవచ్చు. ధర రూ. 32 వేలు.
మనం చేయాల్సిన పనుల వివరాలను ఏదైనా పుస్తకంలో రఫ్‌గా నోట్ చేసుకుంటాం. అప్పుడప్పుడూ చిత్తు కాగితం మీద మనసుకు తోచిన బొమ్మలు గీసుకుంటాం. ఇలాంటివాటికి డిజిటల్ చిత్తు పుస్తకం దొరుకు తున్నది. ‘పోర్ట్రానిక్స్ రఫ్ప్యాడ్ 15ఎమ్’ పేరిట వస్తున్న ఈ పరికరానికి 15 అంగుళాల లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే (ఎల్సీడీ) ఉంటుంది. దీంతోపాటు వచ్చే పెన్నులాంటి పరికరంతో నచ్చింది రాసుకోవచ్చు. రాసింది సేవ్ చేసుకుని ప్రత్యేక యాప్ ద్వారా ఎవరికైనా షేర్ చేయొచ్చు. పని పూర్తయ్యాక బటన్ నొక్కితే.. రాసిందంతా చెరిగిపోయి ఖాళీ స్క్రీన్ కనిపిస్తుంది. రాస్తున్నప్పుడు అక్షరాలూ, బొమ్మలూ రంగురంగుల్లో అందంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఇది డిజిటల్ నోట్సు కాబట్టి, దీన్ని వాడటం ద్వారా పేపర్ల వినియోగం తగ్గించి చెట్లను నరికివేత నుంచి కాపాడుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. portronics.com చూడండి. ధర రూ.1,399.
“Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!”
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”