SSC Exams | పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం(రేపు) ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1,582 సెంటర్లు, ప్రైవేట్ బడుల్లో 1,094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

