ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Sep 25, 2020 , 02:28:37

మత్స్యసంపద ఎగుమతి స్థాయికి పెరగాలి

మత్స్యసంపద ఎగుమతి స్థాయికి పెరగాలి

  • ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి

నర్సాపూర్‌ రూరల్‌ :  మత్స్య సంపద ఎగుమతులు చేసే స్థాయికి పెరగాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్‌ పట్టణంలోని రాయారావు చెరువులో 2లక్షల70వేల చేప పిల్లలను  ఎమ్మెల్యే  వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం జలాలతో చెరువులను నింపి మత్స్యసంపద పెరిగేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లేశ్‌ గౌడ్‌, హబీబ్‌ఖాన్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.    

అన్ని  చెరువులు నింపడమే లక్ష్యం

కౌడిపలి :  నియోజకవర్గంలోని అన్ని చెరువులను, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపడమే లక్ష్యమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. గురువారం ముట్రాజ్‌పల్లి, రాయిలాపూర్‌ గ్రామాల్లోని చెరువులో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆదేశాలతో వచ్చే నెలలో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలపై సర్వే నిర్వహిస్తామన్నారు.  చెరువులు, కుంటలు నిండితే మత్స్యకారులకు వరంగా మారుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, జడ్పీటీసీ కవితఅమర్‌సింగ్‌, ఎంపీపీ రాజునాయక్‌, ఇరిగేషన్‌ ఏఈ ఏసయ్య, సర్పంచ్‌లు కురుమ శేకులు, ఎరుకలి సంజీవులు, ఎంపీటీసీలు గుంజేరి ప్రవీణ్‌కుమార్‌, స్వప్నకిశోర్‌, ఎంపీడీవో అజారుద్దీన్‌ పాల్గొన్నారు.


logo