కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
- ఏ ఎన్నికైనా ఓటమి ఖాయంగా హస్తం పార్టీ పరిస్థితి
- సాగర్లో గట్టెక్కించలేకపోయిన జానా సీనియార్టీ
- మినీ మున్సిపోల్స్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం!

హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసినట్టేనని స్పష్టమవుతున్నది. ఎన్నిక ఏదైనా ఆ పార్టీ ఓటమి ఖాయంగా మారింది. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ రాత మారలేదు. పార్టీ సీనియర్ నేత, పెద్దమనిషిగా పేరున్న కే జానారెడ్డి కూడా కాంగ్రెస్ను గట్టెక్కించలేకపోయారు. యువకుడైన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక తెల్లబోయారు. సాగర్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ ఎన్నికలో గెలిచి పూర్వ వైభవానికి బాట వేయాలని భావించింది. కొత్త అభ్యర్థిని నిలిపితే ఓటమి తప్పదని భావించిన అధిష్ఠానం.. స్థానికంగా మంచి పట్టున్న జానారెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఎన్నిక కోసమే పీసీసీ అధ్యక్షుడి ఎంపికనూ వాయిదావేసింది. జానాతోపాటు సీనియర్ నేతలందరూ ప్రచారం చేశారు. చివరికి జానా సొంత మండలంలోనూ ప్రభావం చూపలేకపోయారు. 30 ఏండ్లపాటు చక్రం తిప్పిన చోటే ఓటమితో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసినట్టేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. సోమవారం వెలువడే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్తున్నారు.
జానారెడ్డి చరిత్ర సమాప్తం!
కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కుగా చెప్పుకొనే సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి టీఆర్ఎస్ చేతిలో వరుసగా రెండో ఓటమి తప్పలేదు. తన రాజకీయ జీవితంలోనే ఇంత తేడాతో పరాజయం కావడం కూడా ఇదే తొలిసారి. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఎనిమిదో సారి గెలిచి చరిత్ర సృష్టిస్తానని చేసిన విజ్ఞప్తిని సాగర్ ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఒక్కసారే అని స్వయం గా అన్న జానారెడ్డి మరోసారి పోటి చేస్తా రా.. లేదంటే ఇంతటితో ఊరుకుంటారా అనే దానిపై చర్చ మొదలైంది. ఒకరకంగా ఈ ఎన్నికల్లో సాగర్ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో జానారెడ్డి రాజకీయ చరిత్ర ఇంతటితో పరిసమాప్తం అయినట్లేనని పరిశీకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

