Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Long Covid కొందరు కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నారు. అయితే ఇలా కోలుకున్న వాళ్లంతా కరోనా నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కరోనా (coronavirus ) మహమ్మారి బారినపడుతున్నారు. కొందరు మహమ్మారిని ఎదిరించలేక ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్నారు. అయితే ఇలా కోలుకున్న వాళ్లంతా కరోనా నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదని, వారిలో చాలామందికి దీర్ఘకాలికంగా కొవిడ్ -19 ( COVID-19 )లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొవిడ్ లక్షణాల (coronavirus symptoms ) జాబితా అంతకంతకే విస్తరిస్తుండగా, ఇప్పుడు లాంగ్ కొవిడ్ ( Long COVID ) కూడా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ప్రభుత్వరంగ ఆరోగ్య సంస్థలు ఈ ప్రమాదకర వైరస్ దీర్ఘకాల ప్రభావాలపై అధ్యయనం చేశారు.

లాంగ్ కొవిడ్ ( Long COVID ) అంటే ఏమిటి..?
కరోనా బాధితులు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్న తర్వాత కూడా అంటే నెగెటివ్ రిపోర్టు వచ్చినా కొంతమందిలో దీర్ఘకాలికంగా లక్షణాలు కనిపించడాన్ని లాంగ్ కొవిడ్ అంటారు. అంటే వారిలో కరోనా వైరస్ ఉండదు, కానీ దాని ప్రభావం మాత్రం వారిపై కొనసాగుతుందన్నమాట. అయితే, ఈ లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్నవారిలో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు లాంటి అవయవాలకు నష్టం జరుగవచ్చు లేదంటే జరుగకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ లాంగ్ కొవిడ్‌కు సంబంధించి ఇప్పటికే సంపూర్ణ అవగాహనలేదు. అయితే, చిన్నస్థాయి పిజీషియన్ కూడా రోగిలో కనిపిస్తున్నవి లాంగ్ కొవిడ్ లక్షణాలా..? లేదంటే ఇతర వ్యాధి లక్షణాలా..? అనే విషయం గుర్తించవచ్చంటున్నారు. నీలో గతంలో ఎన్నడూలేని విధంగా ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఫాగ్ బ్రెయిన్ వంటివి కనిపిస్తే ఆ మూడు లాంగ్ కొవిడ్ లక్షణాలు అయివుండొచ్చని చెబుతున్నారు.

ఛాతిలో నొప్పి ( Chest Pain )
సాధారణంగా కరోనా వైరస్ మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. కానీ ఛాతినొప్పి కూడా దీర్ఘకాలిక కొవిడ్ లక్షణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో అసౌకర్యంగా అనిపించడం, స్వల్పంగా నొప్పిగా ఉండటం లాంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలు అయివుండవచ్చని అంటున్నారు.

శ్వాసలో ఇబ్బంది ( Difficulty in breathing )
శ్వాసలో ఇబ్బంది అనిపించడం అనేది చాలామంది కొవిడ్ పేషెంట్లలో కోలుకున్న తర్వాత కూడా సాధారణంగా కనిపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే కొందరిలో దీర్ఘకాలం ఈ లక్షణం కొనసాగవచ్చని చెబుతున్నారు. ఈ లాంగ్ కొవిడ్ లక్షణం ఉన్నవాళ్లు ఈజీగా శ్వాస తీసుకోలేక పోతారని చెప్పారు.

బ్రెయిన్ ఫాగ్ ( Brain Fog )
కొంతమంది బాధితులు తమకు మత్తుగా, ఏదో తెలియని కన్ఫ్యూజన్గా ఉన్నదని చెబుతుంటారు. ఇది కూడా లాంగ్ కొవిడ్ లక్షణమే. ఎందుకంటే కొంతమంది కరోనా బాధితులు కోలుకున్న తర్వాత కన్ఫ్యూజన్, షార్ట్ మెమొరీ లాస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

లాంగ్ కొవిడ్‌తో ఎవరికి ఎక్కువ ప్రమాదం
ఈ లాంగ్ కొవిడ్ లక్షణాలవల్ల అందరికీ కాకపోయినా కొందరికి మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ చెప్పారు. వృద్ధులు, మహిళలు, స్థూలకాయం ఉన్నవాళ్లు ఈ లాంగ్ కొవిడ్ వల్ల ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Children Health : కరోనా టైంలో మీ పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

