శుక్రవారం 03 జూలై 2020
Sangareddy - Jun 03, 2020 , 00:25:42

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

చిన్నశంకరంపేట : ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 108 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1800 మంది సిబ్బందని నియమించామన్నారు. విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతనే పరీక్షాహాల్‌లోకి పంపిస్తామన్నారు. ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెడతామన్నారు. పరీక్షలు నిర్వహించే సిబ్బందికి మాస్కుతో పాటు హ్యాండ్‌ గ్లౌజులను అందిస్తామన్నారు. ప్రతి విద్యార్థికి మాస్కులతో పాటు శానిటైజర్‌ను ఉంచుతామన్నారు. అనంతరం ఆయన కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు. ఆయన వెంట ఎంఈవో యాదగిరి, ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు కర్రె పోచయ్య ఉన్నారు. 


logo