Boating | వికారాబాద్ జిల్లాలో పర్యాటప ప్రదేశాల్లో ఒకటి ధారూరు మండల పరిధిలోని కోటపల్లి ప్రాజెక్ట్. పరిసర ప్రాంతాల వాళ్లు, ఈ ప్రదేశం గురించి తెలిసిన పర్యాటకులు టైం దొరికితే సరదాగా గడిపేందుకు ఇక్కడికొస్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో కోటపల్లి ప్రాజెక్టుకు సందర్శకులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
కోటపల్లి ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన బోటింగ్ పై పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. పర్యాటకులు నీటిలో బోటింగ్ చేస్తూ.. ఓ వైపు ప్రాజెక్టు అందాలను, మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కుటుంబసభ్యులంతా బోటింగ్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం