Congress Sarpanch | ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ భూములను గుంజుకోవాలని చూస్తున్న సీఎం రేవంత్ సర్కార్ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు 1200 ఎకరాలు భూసేకరణ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాడ్లాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్ ఊరి ప్రజలు, రైతులతో కలిసి రోడ్డుపై భైఠాయించారు. భూసేకరణ ఆపేయాలంటే అల్టిమేటం జారీ చేశాడు.
మీడియాతో కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్ మాట్లాడుతూ.. ఎంతో ఇబ్బంది పడ్డా సరే కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడి కోట్టాడి పరిగి మండలంలో లేని నంబర్ వన్ మెజారిటీ ఇచ్చిన.. ఈ రోజు నాకు చుక్కెదురైతుందంటే.. నాకు కాదు నా కాడ్లాపూర్ ఊరి ప్రజల నుంచి 587 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఒకటికి పదిసార్లు ముందు చెప్పిన.. పది సార్లు చెప్పినా, వంద రకాలుగా చెప్పిన అర్థం చేసుకోండి సార్. నా ఊరి ప్రజలను రోడ్డుపైకి రానీయకండి. వాళ్లు రోడ్డుమీదికొస్తే మీకు మంచిగుండది.. మాకు మంచి గుండది. అనేక రకాలుగా సమస్యలొస్తాయని చెప్పానన్నాడు.
వాళ్లకున్నది అర్థ ఎకరం, పావు ఎకరం..
ఈ కాడ్లాపూర్ కాకుండా, పరిగి కాకుండా వేరే నియోజకవర్గానికి తీసుకెళ్లండని పరిగి ఎమ్మార్వోకు, ఆర్డీవో, కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చినమన్న సర్పంచ్ పులిందర్.. ఇక మిగిలింది ముఖ్యమంత్రి ఒకరే. సీఎం దగ్గరికి పోయే స్థానం మాకు లేదు కాబట్టి.. ఎక్కడికి వరకు పోవాలో అక్కడికి వెళ్లినం.. మొన్న రామ్మోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పార్క్ కోసం మేం అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నమని ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజు నుంచి నా ఊరు ప్రజలు తిండి బంద్ చేసిర్రు. వాళ్లకున్నది అర్థ ఎకరం, పావు ఎకరం, రెండెకరాలు.. ఉన్న కొద్దిగా కూడా పోతుంది.. వేరే దగ్గర ఎక్కడా కూడా వాళ్లకు భూములు లేవు.. చేసుకొని బతుకనీకి ఆధారం లేదు.. దీన్ని అర్థం చేసుకొని ఒకటికి పది సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సారుకు చెప్పిన అమ్మా నేను ఆపుతా.. నేను ప్రయత్నం చేస్తా అన్నడు కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదని వాపోయాడు.
మీరు కూడా కాడ్లాపూర్ గ్రామ ప్రజల కోసం ఒక్కసారి ఆలోచన చేసి భూసేకరణ ఖచ్చితంగా ఆపేయాలి.. లేదంటే ఇవాళ గ్రామంలో ఉన్న 30 శాతం మంది మాత్రమే వచ్చిర్రు.. లేకపోతే రేపు ప్రతీ రైతు పెళ్లాం, పిల్లలతో కలిసి వస్త నాకు నాలుగేండ్ల బిడ్డ ఉంది.. ఐదేళ్ల బాబు ఉన్నాడు. వాళ్లను తీసుకొచ్చి నేను స్థానికంగా ఎమ్మెల్యే ఇంటిదగ్గరకెళ్లి ధర్నా చేస్తా. నా ఊరి ప్రజలను ఊరిలో పెట్టి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్ హెచ్చరించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సర్పంచ్
కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తే మా భూములు లాక్కుంటారా!!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట బలవంతపు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీకి పరిగి మండలంలోనే అధిక మెజారిటీ… https://t.co/3baBLllFbg pic.twitter.com/JPz8sXy6H7
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
భూములు కోల్పోతున్న రైతులపై పోలీసుల దౌర్జన్యం
మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా తోసేసిన పోలీసులు
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాలు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో 1200 ఎకరాలు భూసేకరణ చేస్తున్న అధికారులు
మా భూములు మాకే… https://t.co/I4w7NdTvYK pic.twitter.com/zXl7AmzXyJ
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ