4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా..
రుద్రంపూర్, మార్చి 26 : చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఆ ప్రాంతం చీకటిగా ఉండడంతో ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించిన సింగరేణి యాజమాన్యం సుమారు లక్ష రూపాయల వ్యయంతో లైటింగ్ టవర్ను ఏర్పాటు చేసి, వీధి దీపాలను అమర్చి పంచాయతీకి అప్పజెప్పింది.
అయితే ప్రస్తుతం ఆ లైట్లు 24 గంటలు వెలిగిపోతుండటం గమనార్హం. పగలు సమయంలో కూడా వాటిని ఆపేలా ఎవరూ చూడకపోవడంతో విద్యుత్ వినియోగం పెరిగి, వీధిలైట్ల బిల్లుల భారం పంచాయతీపై పడుతున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు స్పందించి పగలు సమయంలో లైట్లు ఆపి, రాత్రి వేళల్లో మాత్రమే వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

