Virosh | థాయ్‌లాండ్‌లో బడ్డీమూన్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక–విజయ్ జంట..లగ్జరీ విల్లా ఖరీదు తెలిస్తే ఉలిక్కిపడతారు
Virosh | టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం అనంతరం ఇప్పుడు తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గత నెలలో ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో స్నేహితులతో కలిసి ‘బడ్డీమూన్’ ట్రిప్‌లో భాగంగా విహరిస్తోంది.
Virosh | టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం అనంతరం ఇప్పుడు తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గత నెలలో ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో స్నేహితులతో కలిసి ‘బడ్డీమూన్’ ట్రిప్‌లో భాగంగా విహరిస్తోంది. ఈ ట్రిప్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, విజయ్ను “నా భర్త” అని పిలవడం తనకు ఇంకా కొత్తగానే అనిపిస్తోందని ముచ్చటగా చెప్పింది. ఈ వీడియోలో ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, సరదాగా డ్యాన్స్ చేయడం, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం వంటి క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఐదేళ్ల తర్వాత మనం ప్రపంచం మొత్తం తిరుగుతూ ఇలాంటి అందమైన ప్రదేశాలను అన్వేషిస్తుంటాం అంటూ రష్మిక చెప్పిన మాటలు నెటిజన్లను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ జంట థాయ్‌లాండ్‌లోని ప్రసిద్ధ ద్వీపం కో సమూయ్లో ఉన్న ‘కో కూన్’ అనే విలాసవంతమైన విల్లాలో బస చేస్తోంది. చావెంగ్ నోయి కొండలపై ఉన్న ఈ విల్లా ఆధునిక డిజైన్, ప్రకృతి అందాల కలయికగా ఆకట్టుకుంటోంది. మొత్తం 7+2 బెడ్రూమ్లతో, మినిమలిస్టిక్ ఇంటీరియర్ డిజైన్‌తో ఈ విల్లా ఎంతో ప్రశాంత వాతావరణాన్ని అందిస్తోంది. సముద్రం కనిపించే ఓపెన్ సిట్టింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ ఈ విల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఇక ఈ విల్లా ఖర్చు విషయానికి వస్తే, లగ్జరీ స్థాయికి తగ్గట్టుగానే ధర కూడా భారీగానే ఉంది. మూడు రాత్రులకు సుమారు రూ.7.8 లక్షలు ఖర్చవుతుండగా, ఒక్క రాత్రికి దాదాపు రూ.2.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, విల్లా సర్వీసులు, హౌస్‌కీపింగ్, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
విజయ్–రష్మికల వివాహం కూడా ప్రత్యేకంగా జరిగింది. తెలుగు, కొడవ సంప్రదాయాల కలయికగా నిర్వహించిన ఈ వేడుకకు సినీ, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.మొత్తానికి, పెళ్లి అనంతరం బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని, స్నేహితులతో కలిసి ఈ జంట ఎంజాయ్ చేస్తున్న బడ్డీమూన్ ట్రిప్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

