bar clash | ఉప్పల్, మే 26 : బార్లో జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం మీదికొచ్చింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. కుమ్మరి భాస్కర్ కార్ డ్రైవర్ గా పని చేస్తూ బాపునగర్ అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. భాస్కర్‌కు భార్య శ్రీమాత, ఇద్దరు కొడుకులు ప్రవీణ్, పవన్ కుమార్ @ కళ్యాణ్ ఉన్నారు. 26 సంవత్సరాల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలోని వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలంలోని చేగుంట నుండి బ్రతుకుదెరువు నిమిత్తం అంబర్‌పేటకు వచ్చి ఉంటున్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం భాస్కర్ పెద్దకొడుకు కుమ్మరి ప్రవీణ్ కొత్తపేట నందు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో భాస్కర్ చిన్న కుమారుడు పవన్ కుమార్ , అతని స్నేహితుడు రిషికేశ్ ఎలియాస్ నానితో కలిసి రామంతపూర్ లోని గుడ్ డే బార్లో రాత్రి మద్యం తాగుతున్నారు. పటేల్ నగర్ అంబర్‌పేటకు చెందిన లింగనోళ్ల శ్రావణ్ కుమార్ గౌడ్ (26) అనే వ్యక్తి అదే బార్ లో పక్క టేబుల్ పై ఉన్న హరికృష్ణ అనే వ్యక్తితో గొడవపడి హరికృష్ణను బీరు సీసాల తో కొడుతున్నాడు.
గొడవను ఆపుతున్నాడనే కోపంతో..
గొడవను ఆపుతున్నాడనే కోపంతో పవన్ కుమార్‌ను చంపాలనే ఉద్దేశంతో శ్రావణ్ కుమార్ గౌడ్ బీరు బాటిల్‌తో అతడి ఎడమ కణతపై శ్రావణ్ గట్టిగా కొట్టాడు. దీంతో పవన్ కుమార్(24) కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ గొడవలో హరికృష్ణకు కూడా బలమైన గాయాలయ్యాయి.
గుడ్ డే బార్లో ఇంత గొడవ జరుగుతున్నా బార్ యాజమాన్యం వారు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇట్టి గొడవను నివారించకపోవడం వల్ల పవన్ కుమార్ మృతి చెందాడని.. మృతుడు తండ్రి కుమ్మరి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లింగనోళ్ల శ్రావణ్ కుమార్ గౌడ్, గుడ్ డే బార్ యాజమాన్యంపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంసలు